Loading...
Assam: అస్సాంలో వరదల విధ్వంసం.. ఒక్కరోజే 21 మంది మృతి, 5.64 లక్షల మందిపై తీవ్ర ప్రభావం
5.64 లక్షల మందిపై తీవ్ర ప్రభావం

Assam: అస్సాంలో వరదల విధ్వంసం.. ఒక్కరోజే 21 మంది మృతి, 5.64 లక్షల మందిపై తీవ్ర ప్రభావం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2026
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

అస్సాంలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గత మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీటమునగగా,ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ASDMA) వెల్లడించిన వివరాల ప్రకారం,గత 24 గంటల్లో వరదల కారణంగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది వరదల్లో మరణించిన వారి మొత్తం సంఖ్య 31కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో సుమారు 5.64 లక్షల మంది వరదల బారిన పడినట్లు అధికారులు అర్ధరాత్రి విడుదల చేసిన తాజా బులెటిన్‌లో పేర్కొన్నారు.

వివరాలు 

ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నప్రధాన నదులు

వరదల ప్రభావం అత్యధికంగా కనిపించిన శివసాగర్ జిల్లాలో ఒక్కరోజులోనే 13 మంది మృతి చెందారు.

చరాయిదేవ్ జిల్లాలో ఐదుగురు, గోలాఘాట్ జిల్లాలో ఇద్దరు, జోర్‌హాట్ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో వందలాది గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి.

అనేక ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినడంతో పాటు సమాచార, రవాణా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

వివరాలు 

సహాయక చర్యలను వేగవంతం

పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో సహాయక చర్యలను వేగవంతం చేశారు.

ఆర్మీ, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్‌ఎఫ్) బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు.

ADVERTISEMENT