అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా
ఈ వార్తాకథనం ఏంటి
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. గురువారం వెలువడుతున్న ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది.
త్రిపురలో 33 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్షాల కూటమి 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కింగ్‌మేకర్‌గా అవుతుందని విశ్లేషకులు భావించిన కొత్త పార్టీ టిప్రా మోత 11 సీట్లలో తన మెజార్టీని కనబరుస్తోంది.
నాగాలాండ్‌లో బీజేపీ 37స్థానాలల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. దీంతో రాష్ట్రంలో భారీ విజయం దిశగా అడుగులు వేస్తోంది.
మేఘాలయలో ఎన్‌పీపీ 28స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, దాని మిత్ర పక్షం బీజేపీ 4స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇక్కడ టీఎంసీ 6సీట్లలో మెజార్టీని కనబరుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలు
ముందంజలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషయానికొస్తే, ట్రెండ్స్ ప్రకారం మేఘాలయకు చెందిన కాన్రాడ్ సంగ్మా దక్షిణ తురా నియోజకవర్గం నుంచి ముందంజలో ఉన్నారు.
నాగాలాండ్ సీఎం నైఫియు రియో ఉత్తర అంగామి-II స్థానంనుంచి ముందంజలో ఉన్నారు. రియో ఈ నియోజకవర్గం నుంచి ఎన్నడూ ఓడిపోలేదు. అదేవిధంగా త్రిపురలోని బర్దోవాలి నియోజకవర్గంలో సీఎం మాణిక్ సాహా ముందంజలో ఉన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రారంభానికి కొన్ని గంటల ముందు, మేఘాలయ సిఎం కాన్రాడ్ సంగ్మా బుధవారం అర్ధరాత్రి గువాహటిలో బీజేపీ ఈశాన్య వ్యూహకర్త, అస్సాం సిఎం హిమంత బిస్వా శర్మను కలిశారు. గత ఐదేళ్లు మేఘాలయలో ప్రభుత్వాన్ని నడిపిన బీజేపీ-ఎన్‌పీపీ పార్టీలు ఈ ఎన్నికల్లో వేరువేరుగా పోటీచేశాయి. ఈ క్రమంలో ఇరువురి నేతల భేటి ప్రాధాన్యత సంతరించుకున్నది.