AP Assembly Session: ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు.. ఇవాళ సభ ముందుకు పంచాయతీ రాజ్, మున్సిపల్ లా సవరణ బిల్లులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఆరవ రోజు కొనసాగనున్నాయి. సభ ప్రారంభంలో ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. 2017-18, 2018-19 సంవత్సరాల హిందూపూర్ అర్బన్ డెవలప్‌మెంట్ ఆడిట్ రిపోర్టుల ఆలస్యానికి కారణాలను సభ ముందు మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశపెట్టనున్నారు. డివిజినల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీలో సభ్యుని ఎంపికకు ప్రతిపాదనను మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సభ ముందుకు తీసుకురానున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రాంట్‌లు సభ ముందుకు
1. పవన్ కళ్యాణ్ (ఉపముఖ్యమంత్రి) పంచాయితీరాజ్: ₹11,846.92 కోట్లు గ్రామీణాభివృద్ధి: ₹7,949.87 కోట్లు 2. నారా లోకేష్ (పాఠశాల విద్య) పాఠశాల విద్య: ₹29,909.31 కోట్లు ఉన్నత విద్య: ₹2,326.68 కోట్లు 3. డోలా బాల వీరాంజనేయస్వామి (ఆరోగ్యశాఖ) వైద్యం, ఆరోగ్యం: ₹18,421.04 కోట్లు 4. గుమ్మడి సంధ్యారాణి (మహిళా సంక్షేమం) మహిళా, శిశు సంక్షేమం: ₹4,285.95 కోట్లు ఆదివాసీ సంక్షేమం: ₹4,541.86 కోట్లు 5. ఎన్‌ఎండీ ఫరూఖ్ (మైనారిటీ సంక్షేమం) మైనారిటీల సంక్షేమం: ₹2,808.75 కోట్లు న్యాయ పరిపాలన: ₹1,227 కోట్లు
ఇవాళ అసెంబ్లీలో పలు కీలక సవరణ బిల్లులు
1. ఏపీ పంచాయితీరాజ్ సవరణ బిల్లు 2024 2. ఏపీ మున్సిపల్ లా సవరణ బిల్లు 2024 3. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024 4. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024 5. ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు 2024 వచ్చే సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్‌ల ఆమోదం, అభివృద్ధి ప్రాజెక్టులపై తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్‌ను ప్రభావితం చేయనున్నాయి.