Page Loader
Indian Navy: భారత నౌకాదళానికి అదనపు శక్తి.. నావికాదళానికి మూడు యుద్ద నౌకలు 
భారత నౌకాదళానికి అదనపు శక్తి.. నావికాదళానికి మూడు యుద్ద నౌకలు

Indian Navy: భారత నౌకాదళానికి అదనపు శక్తి.. నావికాదళానికి మూడు యుద్ద నౌకలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 30, 2023
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

జలాంతర మార్గాల్లో శత్రువులను ఎదుర్కొనేందుకు భారత్ నౌకాదాళానికి అదనపు శక్తి లభించింది. భారత నౌకాదళం చేతికి యాంటీ సబ్ మైరన్ వార్ఫేర్ లో ఉపయోగించే అత్యాధునికి యుద్ధ నౌకాలు అందాయి. కొచ్చి షిప్ యార్డర్ లో నిర్మిస్తున్న మొత్తం ఎనిమిది నౌకల్లో భాగంగా తయారైన మూడు షిప్ లను ఇవాళ ప్రారంభించారు. ఈ నౌకలకు ఐఎన్ఎస్ మహె, ఐఎన్ఎన్ మల్వాన్, ఐఎన్ఎస్ మాంగ్రోల్ అని నామకరణం చేశారు. వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ నేవల్‌ స్టాఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ జె సింగ్‌, స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండ్‌ అధిపతి సురాజ్‌ బెర్రీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ కమాండంట్‌ పునీత్‌ భల్‌ సతీసమేతంగా హాజరయ్యారు.

Details

భారత్ కు అద్భుతమైన నౌకా నిర్మాణ వ్యవస్థ

భారత్ కు అద్భుతమైన నౌకా నిర్మాణ వ్యవస్థ ఉందని వైస్ అడ్మిరల్ సంజయ్ జె సింగ్ పేర్కొన్నాడు. ఈ కొత్త నౌకలు తీరప్రాంతాల్లో యాంటీ సబ్‌మెరైన్ ఆపరేషన్లు, సముద్రంలో ముందుపాతరలను పర్చడం, నిఘా కార్యక్రమాలను చేపట్టనున్నారు. వాటిలో మైన్స్, 20 ఎంఎం గన్స్, 12.7 ఎంఎం స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్స్, తేలికపాటి టోర్పెడోలు ఉన్నాయి. ప్రతి నౌక 78 మీటర్ల పొడవు, 11.36 మీటర్ల వెడల్పుతో 896 టన్నుల బరువు ఉన్నాయి. ఇవి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ నౌకలో 57 మంది సిబ్బంది ఉంటారు. ఈ నౌకలను తాము నిర్ణీత ధరకే అందజేశామని షిప్‌యార్డ్‌ సీఎండీ మధు తెలియజేశారు.