Page Loader
అవకాశం వచ్చినప్పుడల్లా బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను వేధించారు: దిల్లీ పోలీసులు 
అవకాశం వచ్చినప్పుడల్లా బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను వేధించారు: దిల్లీ పోలీసులు

అవకాశం వచ్చినప్పుడల్లా బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను వేధించారు: దిల్లీ పోలీసులు 

వ్రాసిన వారు Stalin
Sep 24, 2023
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై దిల్లీ పోలీసులు సంచలన విషయాలను రూస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. అవకాశం దొరికినప్పుడల్లా బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించారని కోర్టుకు వెల్లడించారు. అతనిపై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పలువురు అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు కోర్టు ఆదివారం హాజరు నుంచి మినహాయింపునిచ్చింది.

దిల్లీ

తజకిస్థాన్‌ జరిగిన వేధింపులను ఉదహరించిన పోలీసులు

ఇదిలా ఉంటే, మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ భూషణ్‌కు క్లీన్‌చీట్‌ ఇవ్వలేదని కోర్టుకు పోలీసులు వివరించారు. ఆసియా క్రీడల్లో భాగంగా తజకిస్థాన్‌ వెళ్లిన మహిళా రెజ్లర్లలో ఒకరిని భూషణ్‌ తన గదిలో గట్టిగా కౌగలించుకున్నారని పోలీసులు తమ చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అయితే ఒక తండ్రిగా తాను కౌగలించుకున్నాని బ్రిజ్ భూషన్ సమర్థించుకున్నారని వివరించారు. బ్రిజ్ భూషణ్ చర్యలకు సహ నిందితుడు వినోద్ తోమర్ సహకరించారని పోలీసులు తెలిపారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అనుమతి లేకుండా తన షర్టును పైకి లేపి, తన పొట్టను అనుచితంగా తాకాడని మరో మహిళా రెజ్లర్ పేర్కొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.