NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ముంబై బీచ్‌లో ఘోరం; ఫొటోలు దిగుతుండగా అలలకు కొట్టుకుపోయిన మహిళ 
    తదుపరి వార్తా కథనం
    ముంబై బీచ్‌లో ఘోరం; ఫొటోలు దిగుతుండగా అలలకు కొట్టుకుపోయిన మహిళ 
    ముంబై: బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లో ఘోరం; ఫొటోలు దిగుతుండగా అలలకు కొట్టుకుపోయిన మహిళ

    ముంబై బీచ్‌లో ఘోరం; ఫొటోలు దిగుతుండగా అలలకు కొట్టుకుపోయిన మహిళ 

    వ్రాసిన వారు Stalin
    Jul 16, 2023
    03:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ముంబైలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లో ఆదివారం దారుణం జరిగింది. సెలవు దినం అని సముద్ర తీరం వద్దకు విహారానికి వెళ్లిన ఆ కుటుంబానికి విషాదం మిగిలింది.

    తన భర్తతో కలిసి బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌ వద్ద ఫొటోలు దిగుతున్న 32ఏళ్ల జ్యోతి సోనార్ అనే మహిళ భారీ అలలకు కొట్టుకుపోయింది.

    జ్యోతి తన భర్తతో కలిసి ఫొటోలు దిగుతున్న క్రమంలో రాకాసి అల ఒక్కసారిగా మీదపడటంతో ప్రవాహంలో కొట్టుకుపోయింది.

    సెల్ ఫోన్‌లో ఫొటోలు తీస్తున్న తన పిల్లలు చూస్తుండగానే ఆమె మునిగిపోయింది. సెకన్ల వ్యవధిలోనే ఆమె కనిపించకుండాపోయింది.

    జ్యోతి భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. కన్న తల్లి కొట్టుకుపోయిన దృశ్యాన్ని చూసిన ఆ పిల్లలు 'మమ్మీ మమ్మీ' బోరున విలపించారు.

    ముంబై

    మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న కోస్ట్ గార్డ్

    జ్యోతిని ముఖేష్ అనే వ్యక్తి కాపాడే ప్రయత్నం చేశాడు. ఆమెను చీర పట్టుకొని లాగే ప్రయత్నం చేశాడు. ప్రవాహం బలంగా ఉండంటతో ముఖేష్ సైతం ప్రవాహంలో మునిగిపోయాడు.

    దీంతో పక్కన ఉన్న కొందరు అతని కాలును పట్టుకొని వెనక్కి లాగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన సమాచారాన్ని చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.

    అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంద్రా కోట వద్ద సముద్రంలో మునిగిపోయిన జ్యోతి సోనార్ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది.

    జ్యోతి సోనార్ మృతదేహాన్ని పోలీసులకు అప్పగించామని, మృతదేహాన్ని పౌర నిర్వహణలోని కూపర్ ఆసుపత్రికి తరలించామని అధికారి తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బాంద్రా బీచ్‌లో ప్రమాద దృశ్యం

    This is so horrible How can a person risk their life for some videos..
    The lady has swept away and lost her life in front of his kid.#bandstand #Mumbai pic.twitter.com/xMat7BGo34

    — Pramod Jain (@log_kyasochenge) July 15, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబై
    సముద్రం
    తాజా వార్తలు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ముంబై

    ముంబయి: 100ఏళ్ల నాటి 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు- పెచ్చులూడుతున్న స్మారక చిహ్నం మహారాష్ట్ర
    ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ట్విట్టర్
    ప్లాస్టిక్ సంచిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం; కుమార్తెపైనే అనుమానాలు మహారాష్ట్ర
    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్ ఆంధ్రప్రదేశ్

    సముద్రం

    UN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    2031లో ISSని పసిఫిక్ మహాసముద్రంలో పడేయనున్న నాసా నాసా

    తాజా వార్తలు

    చంద్రయాన్-3 ప్రయోగానికి ప్రధాని మోదీ హాజరవుతారా? ఇస్రో చీఫ్ సమాధానం ఇదే ఇస్రో
    జూలై 11న Garena Free Fire MAX కోడ్‌ల రీడీమ్ విధానం: 6వ వార్షికోత్సవ స్పెషల్ ఈవెంట్స్  ఫ్రీ ఫైర్ మాక్స్
    ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్ వర్షాకాలం
    Delhi-Meerut Expressway: ఎస్‌యూవీని ఢీకొన్న స్కూల్ బస్సు; ఆరుగురు మృతి  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025