
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం: ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. చమోలీలో అలకనంద నది ఒడ్డున వంతెనపై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో విద్యుదాఘాతానికి గురై 15మంది చనిపోయారు.
మృతుల్లో ఒక పోలీసు, ఐదుగురు హోంగార్డు సిబ్బంది కూడా ఉన్నారు.
నమామి గంగే ప్రాజెక్టు స్థలంలో బాధితులు పనిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
నమామి గంగే ప్రాజెక్టులో భాగమైన ఈ వంతెన అలకనంద నదిపై ఉంది.
ఈ ఘటన మంగళవారం అర్థరాత్రి జరిగింది. తొలుత ఓ వాచ్‌మెన్ విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది.
పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చూడగా, చాలా మంది విద్యుదాఘాతానికి గురయ్యారు. 10మంది సంఘటనా స్థలంలో మృతి చెందగా, మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
ఉత్తరాఖండ్
విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారణకు ఆదేశించారు.
ఇది చాలా దురదృష్టకర సంఘటన అని, ఎస్‌డీఆర్‌ఎఫ్, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామమని సీఎం పేర్కొన్నారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు హెలికాప్టర్ ద్వారా ఎయిమ్స్ రిషికేశ్‌కు తరలిస్తున్నామని సీఎం చెప్పారు.
రైలింగ్‌లో విద్యుత్ ప్రవాహం కారణంగానే సబ్ ఇన్‌స్పెక్టర్, ఐదుగురు హోంగార్డు సిబ్బందితో సహా 15 మంది మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్‌కుమార్ తెలిపారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రమాదంపై స్పందించిన ఉత్తరాఖండ్ సీఎం
यह बेहद दुखद घटना है। पुलिस, SDRF और बचाव दल मौके पर उपस्थित हैं। घटना के जांच के भी आदेश दिए गए हैं। दोषी के खिलाफ कठोर कार्रवाई की जाएगी: उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी, देहरादून
— ANI_HindiNews (@AHindinews) July 19, 2023
चमोली जिले में अलकनंदा नदी के किनारे ट्रांसफार्मर फटने से 15 लोगों की मृत्यु हुई है। https://t.co/bZS7NyIFBJ pic.twitter.com/LnPOWXXYpi