LOADING...
Atishi Marlena : సీఎం పదవికి అతిశీ రాజీనామా
సీఎం పదవికి అతిశీ రాజీనామా

Atishi Marlena : సీఎం పదవికి అతిశీ రాజీనామా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 09, 2025
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం పదవికి అతిశీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని అతిశీని లెఫ్టినెంట్ గవర్నర్ కోరారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత అనూహ్యంగా సీఎం పదవిని చేపట్టిన అతిశీ, తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామా రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది

Details

అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి

నిన్న వెలువడిన ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరగ్గా, అందులో భారతీయ జనతా పార్టీ 48 స్థానాలను గెలుచుకొని అధికారాన్ని చేపట్టింది. ఆప్ 22 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది