LOADING...
Mahbubnagar: గర్ల్స్ హాస్టల్‌లో దారుణం.. బాత్రూంలో వీడియో రికార్డింగ్
గర్ల్స్ హాస్టల్‌లో దారుణం.. బాత్రూంలో వీడియో రికార్డింగ్

Mahbubnagar: గర్ల్స్ హాస్టల్‌లో దారుణం.. బాత్రూంలో వీడియో రికార్డింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2025
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో కొన్ని రోజులుగా మహిళలపై జరుగుతున్న దారుణాలు, అరాచకాలు తీవ్ర స్థాయికి చేరాయి. చిన్న, పెద్ద అని తేడా లేకుండా కొంతమంది కామాంధులు మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో సీఎం ఆర్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో జరిగిన ఘటనే మరువకముందే, ఇప్పుడు మహబూబ్‌నగర్‌లోని పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో మరో దారుణం వెలుగు చూసింది. బాత్‌రూమ్‌లో ఓ యువకుడు వీడియో రికార్డ్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు హాస్టల్ ముందు ఆందోళన చేపట్టారు.

Details

రంగంలోకి దిగిన పోలీసులు

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇక నవీన్ అనే యువకుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పలువురు విద్యార్థులు తెలిపిన ప్రకారం, ఇదే రకమైన గతంలో కూడా చోటు చేసుకుందన్నారు. మొదటి ఘటన తరువాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడైనా విద్యార్థులు తమకు న్యాయం జరగాలని కోరుతున్నారు.