Murder: నిజామాదాబాద్ జిల్లాలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఆరుగురు హత్య
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చినట్లు తెలిసింది. డిచ్‌పల్లి మండలం మట్లారుకు చెందిన మక్లూర్ ప్రసాద్‌ను అతని స్నేహితుడు ప్రశాంత్ హత్య చేసినట్లుగా చెబుతున్నారు. మక్లూర్ చెందిన ప్రసాద్ కుటుంబం ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్లిపోయారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్‌కు మక్లూరులో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటిపై కన్నేసిన అతని స్నేహితుడు ప్రశాంత్ వారందరిని హత్య చేసినట్లు తెలిసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రశాంత్ తన స్నేహితుడి శవాన్ని డిచ్‌పల్లి హైవే పక్కన పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడని నమ్మబలికి అతని భార్యను కూడా ప్రశాంత్ తీసుకెళ్లాడు. ఆమెను బాసర వద్దనున్న గోదావరిలోకి తీసేశాడు. తర్వాత వారి ఇద్దరి పిల్లలను చంపి పోచంపాడ్ సోన్ బ్రిడ్జి వద్దనున్న కాలువలో పడేశాడు. ప్రసాద్ కుటుంబ సభ్యుల్ని పోలీసులు తీసుకెళ్లారని చెప్పి, ప్రసాద్ ఇద్దరు చెల్లళ్లను వేర్వేరుగా తీసుకెళ్లి ప్రశాంత్ హత్య చేశాడు. మొదటి 3 హత్యలు ప్రధాన నిందితుడు ప్రశాంత్ ఒక్కడే చేశాడని, తరువాత ముగ్గుర్ని మరో ముగ్గురు స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు కేసు నమోదు చేశారు.