LOADING...
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన.. చేతబడి చేశారనే నెపంతో కుటుంబంలోని ఐదుగురు హత్య
ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన.. చేతబడి చేశారనే నెపంతో కుటుంబంలోని ఐదుగురు హత్య

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన.. చేతబడి చేశారనే నెపంతో కుటుంబంలోని ఐదుగురు హత్య

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2024
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా, కొందరు మాత్రం మూఢనమ్మకాలను నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. కుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇట్కల్ గ్రామంలో చేతబడి చేస్తోందన్న అనుమానంతో గ్రామస్తులు ఐదుగురిని క్రూరంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటనలో ముగ్గురు మహిళలున్నట్లు పోలీసులు వెల్లడించారు. చేతబడి కారణంగా వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యారని, ఈ కారణంతోనే ఆ ఐదుగురి ప్రాణాలు తీశామని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.