Page Loader
ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బాలుడ్ని నేలకేసి కొట్టి చంపిన సాధువు
ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బాలుడ్ని నేలకేసి కొట్టి చంపిన సాధువు

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బాలుడ్ని నేలకేసి కొట్టి చంపిన సాధువు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 20, 2023
07:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడ్ని ఓ సాధువు పైకి ఎత్తి పలుమార్లు నేలకేసి కొట్టి చంపాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాకు చెందిన 52 ఏళ్ల ఓం ప్రాకష్ సప్తకోసి అనే సాధువు యాత్ర చేపట్టాడు. అయితే మథుర జిల్లాలోని గోవర్ధన ప్రాంతానికి చేరకున్న అతడు ఉన్నట్టుండి వితంగా ప్రవర్తించి, ఓ బాలుడిని భుజానికి ఎత్తుకున్నాడు. ఆ తర్వాత బాలుడి కాళ్ల పట్టుకొని పలుమార్లు నేలకేసి కొట్టాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బాలుడిని నేలకేసి కొడుతున్న దృశ్యం