Page Loader
Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు!
బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు!

Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని ఆనేకల్ తాలూకాలోని హళేచందాపుర రైల్వే బ్రిడ్జ్ సమీపంలో సూట్‌కేస్‌లో గుర్తుతెలియని బాలిక మృతదేహం లభ్యమైన కేసును సూర్యనగర పోలీస్ స్టేషన్ పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో ఈ దారుణ ఘటన పాఠకులను కలిచివేసే వివరాలతో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలికపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి రైల్వే ట్రాక్ పక్కన పడేశారు. ఈ కేసులో బీహార్‌కు చెందిన ఏడుగురు నిందితులు అరెస్టయ్యారు. వారు - అశిక్ కుమార్‌ (22), ముఖేష్ రాజబన్షి (35), ఇందు దేవి (32), రాజారామ్ కుమార్‌ (18), పింటూ కుమార్‌ (18), కాలు కుమార్‌ (17), రాజు కుమార్‌ (17).

Details

అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు

ఈ ఏడుగురిలో ప్రధాన నిందితుడు అశిక్ కుమార్‌ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ బెంగళూరులోని కాచనాయకనహళ్లిలో నివసిస్తున్నాడు. మే 13న అశిక్ బీహార్ వెళ్లి, పక్క గ్రామానికి చెందిన ఓ బాలికను మాయమాటలతో తన వలలో పడేసాడు. మే 15న ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చి, మే 18న నగరానికి చేరాడు. అదే రోజున ఆమెతో కలిసి నగరాన్ని తిరిగాడు. ఆపై అశిక్ కుమార్ బాలికను తన బంధువు ముఖేష్ ఇంటికి తీసుకెళ్లాడు. మే 19న బాలిక లైంగిక సంబంధానికి అంగీకరించకపోవడంతో అశిక్ ఆమెపై అత్యంత దారుణంగా దాడికి దిగాడు. బీర్ బాటిల్‌తో బాలిక ప్రైవేట్ భాగాలపై దాడి చేశాడు.

Details

ఏడుగురు నిందితులు అరెస్టు

అనంతరం రాడ్‌తో మళ్లీ దాడి చేసి, ఆమెపై అత్యాచారం చేశాడు. చివరికి ఊపిరి ఆడకుండా చేసి బాలికను హత్య చేశాడు. తరువాత నిందితుడు అశిక్ ఈ విషయాన్ని తన బంధువులకు తెలిపాడు. నిందితులంతా కలిసి బాలిక మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి, క్యాబ్‌లో హళేచందాపుర రైల్వే బ్రిడ్జ్ సమీపానికి తరలించారు. అక్కడ రైల్వే ట్రాక్ కిందకు సూట్‌కేస్‌ను పడేశారు. ఈ ఘటనను రైలు నుంచి విసిరినట్లుగా చూపించేందుకు ప్రయత్నించారు. అనంతరం ఏడుగురు నిందితులు బీహార్‌కు పారిపోయారు.

Details

సీసీ కెమరాల ఆధారంగా నిందితుల గుర్తింపు

పోలీసులు బాలిక మృతదేహం లభ్యమైన ప్రదేశంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కదలికలు గుర్తించారు. బాలిక మృతదేహాన్ని సూట్‌కేస్‌లో తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఆధారాలన్నింటినీ బట్టి బీహార్‌లో ఉన్న నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇక మృత బాలిక తండ్రి బీహార్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేయగా, దానిపై విచారణ చేపట్టిన బీహార్ పోలీసులు సూర్యనగర పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సూర్యనగర పోలీసులు జరిగిన ఘోరమైన ఘటనను గుర్తించి, కేసును ఛేదించారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు పోక్సో చట్టం కింద దర్యాప్తు కొనసాగిస్తున్నారు.