UP: పోర్న్ వీడియోలు చూస్తున్న ఉపాధ్యాయుడిని పట్టుకున్న విద్యార్థిపై దాడి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ నగరంలో ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్థిని కొట్టాడు.
ప్రైవేట్ స్కూల్ టీచర్, క్లాస్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నప్పుడు, విద్యార్థులు అతన్ని చూసి నవ్వడం వల్ల ఆగ్రహించి బాలుడిని చితకబాదాడు.
ఈ ఘటనపై బాలుడి తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కుల్దీప్ యాదవ్ అనే టీచర్ విద్యార్థిని తలను గోడకు బాదడంతో పాటు కర్రతో కొట్టి, అసభ్య పదజాలంతో దూషించాడు.
Details
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఈ దాడిలో బాలుడి చెవికి గాయాలయ్యాయి. బాలుడి తండ్రి జై ప్రకాష్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, తన కొడుకును క్షతగాత్రుడిని చేసిన టీచర్‌పై చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడైన టీచర్ కుల్దీప్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జిల్లా ఎస్పీ గోపీనాథ్ సోనీ మాట్లాడారు. పాఠశాలలో ఈ దాడి జరిగిందని, క్లాస్‌రూంలో పోర్న్ వీడియోలు చూస్తున్న టీచర్ విద్యార్థిని కొట్టినట్లు వివరించారు.