
Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
తుళ్లూరు మండలంలో రాజకీయ ఉద్రిక్తత చెలరేగింది. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, నందిగం సురేష్ తనపై దాడి చేశాడని ఆరోపించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నందిగం సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన సురేష్ స్వగ్రామమైన ఉద్దండరాయునిపాలెంలో చోటుచేసుకుంది.
Details
విచారణ ప్రారంభిస్తున్న పోలీసులు
సమాచారం మేరకు సురేష్ ఇంటి సమీపంలో వాగ్వాదం ఉద్రిక్తతగా మారి, ఫిజికల్ దాడికి దారి తీసింది. ఈ ఘటనలో గాయపడిన ఇసుకపల్లి రాజును మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దాడి ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. నందిగం సురేష్‌తో పాటు, ఘటనలో సంబంధం ఉన్న వారిలో అతని సోదరుడు, ఇతర బంధువుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
గ్రామస్థుల మధ్య రాజకీయ వేడి పెరిగిన నేపథ్యంలో పోలీసులు మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముంది.