Complaint vs complaint: రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు
పార్లమెంటులో గురువారం జరిగిన తోపులాట వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు నమోదు చేసింది. పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ అవాంతరం కలిగించడంతో తమ ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారని కమలం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీపై దాడి చేసేందుకు ఏ చట్టం అధికారం ఇచ్చిందని,ఇతర ఎంపీలను కొట్టడానికే కరాటే లేదా కుంగ్ ఫూ నేర్చుకున్నారా? అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సెటైర్లు వేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీపై దాడి,ప్రేరేపణ కేసులు పెట్టినట్లు తెలిపారు. ఆయనపై సెక్షన్ 109,115,117,125, 131, 351 కింద ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రత్యేకంగా సెక్షన్ 109 హత్యాయత్నం కింద పేర్కొన్నారు.
రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు
గాయపడిన ఎంపీల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన మోదీ
అంతేకాక, అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ఇండియా కూటమి పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టింది. ఈ సమయంలో రెండు వర్గాల మధ్య హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారు. వారిని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ గాయపడిన ఎంపీలను ఫోన్‌లో పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగారు.