Page Loader
 MMTS: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం
సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం

 MMTS: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 24, 2025
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై జరిగిన అత్యాచారయత్నం కలకలం రేపుతోంది. రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు లైంగిక దాడికి ప్రయత్నించగా, అతని నుంచి తప్పించుకునే క్రమంలో యువతి రైలు నుంచి దూకి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

Details

కదులుతున్న రైలు నుంచి దూకేసిన బాధితురాలు

బాధితురాలు అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన 23 ఏళ్ల యువతి. హాస్టల్‌లో ఉంటూ ప్రైవేట్‌గా ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 22వ తేదీ సాయంత్రం మేడ్చల్ రైల్వేస్టేషన్‌కు వెళ్లి, అక్కడి నుంచి ఎంఎంటీఎస్ రైలు ఎక్కి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఆమె సెల్‌ఫోన్ రీఫెరింగ్ చేయించుకుని తిరిగి మేడ్చల్‌కు వెళ్లేందుకు ఉమెన్స్ కోచ్‌లో ఎక్కింది. అయితే అప్పటికే బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్‌లో దిగిపోవడంతో, కోచ్‌లో ఆమె ఒక్కతే మిగిలిపోయింది. అంతలో 25 ఏళ్ల యువకుడు బోగీలోకి వచ్చి ఆమెను గట్టిగా పట్టుకొని లైంగిక దాడికి యత్నించాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆమె, కదులుతున్న రైలు నుంచి బయటకు దూకేసింది.

Details

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కోంపల్లి సమీపంలోని రైలు బ్రిడ్జి వద్ద పడిపోవడంతో తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం యువతిని డిశ్చార్జ్ చేసిన వైద్యులు, ఆమె వద్ద నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.