Page Loader
స్కిల్ డెవలప్ మెంట్ కేసు: సీఐడీ విచారణకు హాజరైన కిలారు రాజేశ్ 
స్కిల్ డెవలప్ మెంట్ కేసు: సీఐడీ విచారణకు హాజరైన కిలారు రాజేశ్

స్కిల్ డెవలప్ మెంట్ కేసు: సీఐడీ విచారణకు హాజరైన కిలారు రాజేశ్ 

వ్రాసిన వారు Stalin
Oct 16, 2023
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను స్కిల్ డెవలప్ మెంట్ కేసు కుదిపేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉండగా, తాజాగా మరో కీలక పరిణామం జరిగింది. స్కిల్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కిలారు రాజేశ్ సోమవారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు రాజేశ్ అత్యంత సన్నిహితుడు. విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని రెండు రోజుల క్రితం రాజేశ్‌కు సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. దీంతో సోమవారం ఉదయం తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి కిలారు వచ్చారు. రాజేశ్ విదేశాలకు పారిపోయారని ఇటీవల సీఐడీ చెప్పిన నేపథ్యంలో.. తాను ఏపీలో ఉన్నట్లు ఆయన ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తాడేపల్లి సిట్ కార్యాలయంలో సీఐడీ విచారణ