Page Loader
Kumbh Mela 2025: మహా కుంభంలో మౌని అమావాస్య వేళ..  భక్తులకు అడ్వైజరీ  జారీ చేసిన అధికారులు 
మహా కుంభంలో మౌని అమావాస్య వేళ.. భక్తులకు అడ్వైజరీ జారీ చేసిన అధికారులు

Kumbh Mela 2025: మహా కుంభంలో మౌని అమావాస్య వేళ..  భక్తులకు అడ్వైజరీ  జారీ చేసిన అధికారులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2025
06:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహా కుంభమేళాలో (Kumbh Mela 2025) పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది ప్రయాగ్‌రాజ్‌కు తరలిపోతున్నారు. ఇప్పటివరకు సుమారు 15 కోట్ల మంది త్రివేణి సంగమాన్ని సందర్శించినట్లు అంచనా. సంక్రాంతి రోజు మాత్రమే మూడున్నర కోట్ల మంది వచ్చారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మౌని అమావాస్య (Mauni Amavasya) రోజున సుమారు 10 కోట్ల మంది పుణ్యస్నానాల కోసం రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్బంగా, భద్రతను మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. భక్తులకు తాజా అడ్వైజరీని విడుదల చేశారు. భద్రతా నియమాలు పాటించేందుకు, అధికారులకు సహకరించాలనీ విజ్ఞప్తి చేశారు.

వివరాలు 

రోడ్ల మీద గుంపులుగా నిలబడ కూడదు 

భక్తులు నిర్ణయించిన మార్గాల్లోనే ఘాట్‌లకు వెళ్లాలి. స్నానాల తర్వాత అక్కడ ఎక్కువసేపు నిలబడి ఉండకూడదు. పార్కింగ్‌ ప్రాంతాలకు లేదా బస చేసే స్థలాలకు తిరిగి చేరుకోవాలి. బారికేడ్ల వద్ద, పాంటూన్‌ బ్రిడ్జిలపై జాగ్రత్తగా నడవాలి. తొందరపాటు చర్యలు ప్రమాదాలకు దారి తీస్తాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తే, ఆ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సెక్టార్‌ ఆసుపత్రులకు వెళ్లాలి. సంగమంలో ఉన్న అన్ని ఘాట్‌లు పవిత్రమైనవే. అందుకని, ఎక్కడ చేరుకుంటే అక్కడే స్నానాలు చేయడం ఉత్తమం. సోషల్‌ మీడియా లేదా ఇతర మార్గాల్లో వచ్చే వదంతులకు నమ్మకపడకండి. సౌకర్యాలు, ఏర్పాట్ల గురించి చేసే అబద్ధ ప్రచారాలను విశ్వసించవద్దు. రోడ్ల మీద గుంపులుగా నిలబడి ఉండకూడదు. స్నాన ప్రదేశాలు, ఆలయాల్లో హడావుడిగా వెళ్లకూడదు.

వివరాలు 

పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది భక్తులు

అప్రమత్తంగా ఉంటూ, అవసరమైనప్పుడు పోలీసులు, అధికారుల సహాయం తీసుకోవాలి. మౌని అమావాస్య రోజు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది భక్తులు తరలివస్తారని అంచనా. ఈ సందర్భంగా, జనసంద్రాన్ని సక్రమంగా నియంత్రించేందుకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. సాధారణ పోలీసు శాఖతో పాటు, అత్యవసర పరిస్థితులలో వైద్య నిపుణుల బృందాలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. భక్తులు అధికారుల సూచనలు కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.