సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురు; ముందస్తు బెయిల్ తిరస్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ముందస్తు బెయిల్ కోసం వైఎస్ అవినాష్‌రెడ్డి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ వైఎస్ అవినాష్‌రెడ్డి పిటిషన్‌ను తోసి పుచ్చంది.
వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ జాబితాలో లేనందున విచారించలేమని ధర్మానసం స్పష్టం చేసింది.
జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ముందు అవినాష్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇదిలా ఉంటే, వైఎస్ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సంబంధించిన అన్ని ప్రక్రియలను సీబీఐ అధికారులు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ముందస్తు బెయిల్ తిరస్కరణ
Supreme Court Vacation Bench refused to take up the Anticipatory Bail petition of YS Avinash Reddy.#YSVivekaCase
— MIRCHI9 (@Mirchi9) May 22, 2023