LOADING...
Avocado Cultivation: సీమ నేలపై అవకాడో పంట.. ఎకరాకు 5 టన్నుల దిగుబడితో రైతు సత్తా
సీమ నేలపై అవకాడో పంట.. ఎకరాకు 5 టన్నుల దిగుబడితో రైతు సత్తా

Avocado Cultivation: సీమ నేలపై అవకాడో పంట.. ఎకరాకు 5 టన్నుల దిగుబడితో రైతు సత్తా

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 22, 2026
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

సాధారణంగా చల్లటి వాతావరణం ఉన్న ప్రాంతాల్లోనే సాగు చేసే అవకాడో పంట ఇప్పుడు రాయలసీమలోనూ విజయవంతంగా పండుతోంది. వైఎస్సార్‌ కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్ల గ్రామానికి చెందిన యువరైతు కర్ణవరదారెడ్డి వినూత్నంగా ఆలోచించి అవకాడో సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించారు. నాలుగేళ్ల క్రితం అవకాడో సాగుపై ఆసక్తి పెంచుకున్న ఆయన, కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతం నుంచి నాణ్యమైన అంటుకట్టిన మొక్కలను తెప్పించారు. తనకు ఉన్న రెండెకరాల భూమిలో ఎకరానికి 110 మొక్కల చొప్పున నాటారు. బిందు సేద్యం ద్వారా మొక్కలకు అవసరమైన నీటిని అందిస్తూ, పూర్తిగా సేంద్రియ ఎరువులనే వినియోగించారు. ఈ నాలుగేళ్ల కాలంలో పంటకు ఎలాంటి తెగుళ్లు సోకకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

వివరాలు 

నాలుగేళ్ల తర్వాత లాభాల పంట

నాలుగేళ్ల నిరీక్షణ అనంతరం అవకాడో చెట్లు దిగుబడినివ్వడం ప్రారంభించాయి. ఆదివారం తొలి విడత కోతలు చేపట్టగా ఎకరానికి సుమారు 5 టన్నుల దిగుబడి లభించింది. తోటలో ఇంకా మరో 5 టన్నుల మేర పంట కోయాల్సి ఉందని రైతు తెలిపారు. దిగుబడిగా వచ్చిన అవకాడో పండ్లను కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు కర్ణవరదారెడ్డి చెప్పారు. ప్రత్యేకంగా మార్కెట్ కోసం తిరగాల్సిన అవసరం లేకుండా వ్యాపారులే నేరుగా తోట వద్దకు వచ్చి కొనుగోలు చేయడం ఆనందంగా ఉందన్నారు. రాయలసీమ వాతావరణంలోనూ అవకాడో సాగు విజయవంతంగా సాధ్యమని తన అనుభవం నిరూపించిందని ఆయన పేర్కొన్నారు.

Advertisement