Ayodhya: అయోధ్యలో రామమందిరం కోసం 400కిలోల తాళం తయారు చేసిన వృద్ధ దంపతులు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయం 2024 జనవరిలో ప్రారంభం కానున్నట్లు ట్రస్ట్ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.
ఈ క్రమంలో అలీఘర్‌కు చెందిన వృద్ధ కళాకారుల జంట అయోధ్యలోని రామ మందిరానికి 400 కిలోల తాళాన్ని సిద్ధం చేశారు.
చేతితో తయారు చేసే తాళాలకు అలీఘర్ చాలా ప్రసిద్ది.
ఈ నేపథ్యంలో శ్రీరాముడి భక్తుడైన సత్య ప్రకాష్ శర్మ తన ఇష్ట దేవం కోసం 'ప్రపంచంలోనే అతిపెద్ద హ్యాండ్‌మేడ్ తాళం'ను తయారు చేశారు. దీని కోసం అతను నెలల తరబడి శ్రమించారు.
సత్య ప్రకాష్ శర్మ ఈ ఏడాది చివర్లో రామమందిరం అధికారులకు ప్రత్యేకమైన తాళాన్ని బహుమతిగా ఇవ్వాలని యోచిస్తున్నారు.
అయోధ్య
పొదుపు చేసుకున్న డబ్బులతో తాళం తయారీ
ఈ భారీ తాళం 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో ఉంటుంది.
ఈ తాళాన్ని తెరిచేందుకు ఉపయోగించే కీ 4 అడుగుల పొడవు ఉంటుంది.
ఈ తాళాన్ని తయారు చేయడానికి సత్య ప్రకాష్ శర్మకు దాదాపు రూ. 2 లక్షలు అయ్యింది. తాను ఇప్పటి వరకు పొదుపు చేసుకున్న డబ్బులను ఈ భారీ తాళం చేసేందుకు వెచ్చించారు.
ఈ తాళం తయారు చేయడంపై సత్య ప్రకాష్ శర్మ స్పందించారు. దశాబ్దాలుగా తాళాలు వేసే పనిలో తాను ఉన్నందున ఆలయానికి భారీ తాళం వేయాలని అనుకున్నట్లు చెప్పారు.
ఎంతో ప్రేమతో ఈ తాళాన్ని తయారు చేసినట్లు వివరించారు. ఇందుకు తన భార్య రుక్మిణీ తనకు సహకరించినట్లు ఆయన వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
400కేజీల తాళంతో కళాకారులు
An elderly artisan from #Aligarh, famous for its handmade locks, has made a 400 kg lock for the Ram Mandir in Ayodhya which is expected to open for devotees in January next year. pic.twitter.com/jV3cztM9FY
— JK Media (@jkmediasocial) August 6, 2023