
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన చేసిన బాలకృష్ణ
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏపీ రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్‌ను స్థాపించడానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమిపూజ కార్యక్రమాన్ని తుళ్లూరు సమీపంలో బుధవారం ఉదయం సంస్థ ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహించారు.
వివరాలు
రెండు దశల్లో నిర్మాణం
మొత్తం 21 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ క్యాన్సర్ కేర్ క్యాంపస్‌లో సమగ్ర క్యాన్సర్ చికిత్స, పరిశోధనతో పాటు రోగుల సంరక్షణకు ప్రత్యేక ఎక్స్‌లెన్సీ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలు అందించనున్నారు. ఈ దశలో రూ.750 కోట్ల భారీ పెట్టుబడితో మౌలిక సదుపాయాలు నిర్మించి,అత్యాధునిక వైద్య పరికరాలను సమకూరుస్తారు. వ్యాధి నివారణ,ముందస్తు గుర్తింపు,చికిత్స వంటి అన్ని దశలను ఒకే చట్రంలో అందించేందుకు 'ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్'ను అమలు చేయనున్నారు.
వివరాలు
2028 నాటికి శస్త్రచికిత్సలు
2028 నాటికి శస్త్రచికిత్సల విభాగాన్ని ప్రారంభించాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. రెండో దశలో పడకల సంఖ్యను 1,000కి పెంచి,ప్రత్యేక వైద్య విభాగాలు, పరిశోధన విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా క్లిష్టమైన, అత్యాధునిక క్యాన్సర్ కేసులకు ఈ కేంద్రాన్ని ప్రాంతీయ రిఫరల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు కొనసాగనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన చేసిన బాలకృష్ణ
అమరావతిలో నూతనంగా నిర్మించే బసవతారకం హాస్పిటల్ భూమి పూజ కార్యక్రమంలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ❤️#NandamuriBalakrishna #Akhanda2 pic.twitter.com/oFrAjOJMMa
— manabalayya.com (@manabalayya) August 13, 2025