
Hijab ban row: కర్ణాటకలో నేటి నుంచి హిజాబ్ ధరించొచ్చు.. సిద్ధరామయ్య ప్రభుత్వం ఉత్తర్వులు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో హిజాబ్ నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.
ఈమేరకు విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని తొలగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో శనివారం నుంచి ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి పాఠశాలలకు రావొచ్చు.
హిజాబ్‌ను నిషేధిస్తూ 2022లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మైసూరులో జరిగిన ఓ సభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. హిజాబ్‌పై ఇప్పుడు నిషేధం లేదన్నారు.
మహిళలు హిజాబ్ ధరించి ఎక్కడికైనా వెళ్లవచ్చన్నారు. రాష్ట్రంలో ప్రజలు తమకు నచ్చిన దుస్తులు ధరించడానికి, నచ్చినది తినడానికి ఎలాంటి ఆంక్షలు లేవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
బీజేపీ
సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర: బీజేపీ ఆరోపణ
కర్ణాటకలో హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేయడం వల్ల రాష్ట్రంలో షరియా చట్టం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు.
ప్రతిపక్షాలకు ఓటు వేస్తే దేశవ్యాప్తంగా ఇస్లామిక్ చట్టం అమలులోకి వస్తుందని విమర్శించారు.
సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు.
సిద్ధరామయ్య ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను పొందాలని సిద్ధరామయ్య భావిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆరోపించారు.
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల మధ్య విభేదాలు సృష్టించేందుకు సిద్ధరామయ్య ఇలా చేస్తున్నారన్నారు.
ఈ చర్య చట్టబద్ధంగా జరుగుతోందని, ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని కాంగ్రెస్ చెబుతోంది.