
Bandi Sanjay: బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడి గుడ్ల దాడి.. పోలీసులపై ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
వరంగల్‌లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర నిర్వహిస్తున్నారు. యాత్ర చేస్తుండగా బండి కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు.
ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్ వరంగల్‌లో పర్యటించిన సందర్భంలో ఈ దాడి జరిగింది.
ఈ దాడితో అసహనం చెంది బండి సంజయ్, బీజేపీ కార్యకర్తలు పోలీసు బందోబస్తు వద్దని.. మీరు వెళ్లిపోండి.. అంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు.
కాన్వాయ్‌పై దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలేనని బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు ఆరోపించారు.
గుడ్లు విసిరిన వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. యాత్ర సందర్భంగా వంగరలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఇంటిని బండి సంజయ్ సందర్శించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వంగరలో ప్రజాహిత యాత్ర చేస్తున్న బండి సంజయ్
బండి సంజయ్ మీద కోడి గుడ్ల దాడి
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2024
కోడిగుడ్ల దాడితో అసహనం చెంది పోలీసు బందోబస్తు నాకు ఏమీ వద్దు.. మీరు వెళ్లిపోవాలని చెప్పిన బండి సంజయ్.
వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ప్రజాహిత యాత్ర చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బండి సంజయ్ కాన్వాయ్ మీద గుడ్లు విసిరారు. pic.twitter.com/U6AwJAs5nJ