LOADING...
Bandi Sanjay: కాంగ్రెస్‌ ప్రభుత్వం,సిట్‌ అధికారుల మీద నాకు నమ్మకం లేదు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!
కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!

Bandi Sanjay: కాంగ్రెస్‌ ప్రభుత్వం,సిట్‌ అధికారుల మీద నాకు నమ్మకం లేదు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 08, 2025
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కాసేపట్లో సిట్‌ విచారణకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన వద్ద ఉన్న రికార్డులు, ఆధారాలను సిట్‌ అధికారులకు అందజేస్తానని వెల్లడించారు. కేంద్ర మంత్రిగా,అలాగే బాధ్యత గల పౌరుడిగా అవసరమైన అన్ని ఆధారాలను సమర్పిస్తానని స్పష్టం చేశారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. "తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని మొదట బయటపెట్టిన వ్యక్తి నేనే. గత వారంలోనే సిట్‌ నన్ను విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే పార్లమెంట్‌ సమావేశాల కారణంగా ఆ సమయానికి విచారణకు హాజరు కాలేకపోయాను. ఈ కేసులో రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌కు మొదటి బాధితుడు కూడా నేనే" అని తెలిపారు.

వివరాలు 

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగిస్తే..

అలాగే ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వం, సిట్‌ అధికారులపై తనకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. సిట్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇవ్వడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల్లో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగిస్తే, తన వద్ద ఉన్న అన్ని వివరాలను వెలుగులోకి తెస్తానని బండి సంజయ్‌ స్పష్టంగా తెలిపారు.