
Bangalore: పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడంతో మహిళ దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
తనను పెళ్లి చేసుకోమని పలుమార్లు అడిగినా కాదంటుందన్న కోపంతో ప్రియురాలిపై కత్తితో పలుమార్లు దాడి చేయగా అక్కడికక్కడే సదరు యువతి మృతి చెందింది.
అనంతరం నేరుగా పోలీసుస్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
బెంగళూరులోని జయానగర్ కు చెందిన గిరీశ్ అనే యువకుడు (35) క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
పశ్చిమ బెంగాల్ నుంచి ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చి స్థానిక స్పా సెంటర్లో పనిచేస్తున్న ఫరీదా ఖాటున్ (42)లు గత పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
మార్చి 29న గిరీశ్ పుట్టినరోజు ఉండటంతో 26న ఫరీదా తన కూతుళ్లను కూడా పశ్చిమబెంగాల్ నుంచి బెంగళూరుకు తీసుకు వచ్చింది.
Bangalore
పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని..
తన కూతురుకు మంచి కాలేజీలో చేర్పించే పనితో పాటు గిరీశ్ పుట్టిన రోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ఫరీదా అనుకుంది.
ఫరీదాతోపాటు ఆమె కూతుళ్లను కూడా తీసుకుని గిరీశ్ శనివారం షాపింగ్ చేసి ఓ హోటల్ లో లంచ్ కూడా చేశారు.
తిరిగి వచ్చే క్రమంలో షాలిని గ్రౌండ్స్కు చేరుకోగానే తనను పెళ్లి చేసుకోవాలని గిరీశ్ ప్రతిపాదించాడు.
ఈ ప్రతిపాదనను ఫరీదా అంగీకరించకపోవడంతో గిరీశ్ వెంట తెచ్చుకున్న కత్తితో ఫరీదాపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
దీంతో తీవ్రగాయాలపాలైన ఫరీదా అక్కడికక్కడే మృతిచెందింది.
గిరీశ్ అక్కడ్నుంచి నేరుగా జయానగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిపై ఐపీసీ 302 కింద కేసు నమోదు చేశారు.