
Banglore: వింగ్ కమాండర్ పై దాడి కేసులో కొత్త మలుపు, IAF అధికారిపై కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ బోస్‌పై బెంగళూరులో జరిగిన దాడి ఘటన తాజాగా సంచలనం రేపుతోంది.
ఆయన భార్య మధుమిత, స్వయంగా ఒక స్క్వాడ్రన్ లీడర్ కూడా కాగా,ఈదంపతులు ఇద్దరూ కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో,కొందరు ద్విచక్రవాహనదారులు వారిని అడ్డగించి దాడికి పాల్పడ్డారని వారు ఆరోపించారు.
ఈసంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా బయటకు వచ్చింది. అయితే ఆ దృశ్యాల్లో మొదట బోస్ దాడికి దిగినట్లుగా కనిపిస్తోంది.
సీసీటీవీ వీడియోల ప్రకారం,ఫుట్‌పాత్‌పై నిల్చొని ఉన్న వికాస్ కుమార్ అనే వ్యక్తిపై ముందుగా బోస్ దాడికి దిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ తర్వాత బోస్‌ను అడ్డుకునేందుకు వచ్చిన మిగతా వ్యక్తులపై కూడా ఆయన హింసాత్మకంగా ప్రవర్తించినట్లు ఆ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది.
వివరాలు
వింగ్ కమాండర్ బోస్ ముఖం నుంచి రక్తస్రావం
అయితే, ఈ ఘటనలో ఒకవైపు వ్యక్తులే బాధితులుగా ఉన్నారన్న అనుమానాల మధ్య, ఇది వింగ్ కమాండర్‌ను లక్ష్యంగా చేసుకుని చేయబడిన దాడి కాదని, ఇరు పక్షాల మధ్య ఉద్భవించిన ఘర్షణగా భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
ఈ తగాదాకు నిజమైన కారణం ఏమిటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని ఒక పోలీసు అధికారి వెల్లడించారు.
ఈ ఘటనపై బెంగళూరు డిప్యూటీ పోలీస్ కమిషనర్ దేవరాజ్ మాట్లాడుతూ,ఇది పరస్పర దాడిగా కనిపిస్తున్నదని చెప్పారు.
వింగ్ కమాండర్ బోస్ ముఖం నుంచి రక్తస్రావం కావడంతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చినట్టు తెలిపారు.
అక్కడ వారికి తక్షణ చికిత్స అందించిన తరువాత,ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమంటే ఆయనకు విమాన ప్రయాణానికి సమయం కావడంతో వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు.
వివరాలు
బోస్‌పై వికాస్ కుమార్ హత్యాయత్నం
తర్వాత బోస్ ఒక వీడియోను విడుదల చేయడంతో ఆయన భార్య మధుమితను గుర్తించి సంప్రదించామని,ఆమె స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
అందులో భాగంగా బోస్‌పై వికాస్ కుమార్‌ను హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశామని తెలిపారు. త్వరలోనే బోస్‌ను కూడా విచారించనున్నట్లు సమాచారం.
బోస్ విడుదల చేసిన వీడియోలో ఆయన ముఖం, మెడ నిండి రక్తస్రావం కావడం స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ సమయంలో ఆయన భార్యే కారు నడుపుతున్నారు.
వివరాలు
కారుపై ఉన్న డీఆర్‌డీఓ స్టిక్కర్
ఆ వీడియోలో బోస్ మాట్లాడుతూ, "మేము కారు లో ప్రయాణిస్తుండగా, బైక్‌పై వచ్చిన కొందరు వ్యక్తులు మమ్మల్ని అడ్డగించారు. వారు మొదట మమ్మల్ని తిడుతూ మా కారుపై ఉన్న డీఆర్‌డీఓ స్టిక్కర్‌ను చూశారు. వారు నా భార్యపై అసభ్యంగా మాటలాడటంతో సహించలేక, నేను కారులో నుంచి బయటకు వచ్చాను. అప్పుడు ఒక్క వ్యక్తి తన కీతో నా ముఖంపై గట్టిగా కొట్టాడు. దాంతో నా ముఖమంతా రక్తంతో నిండి పోయింది. మిమ్మల్ని రక్షించే వ్యక్తులతో మీరు ఇలాగేనా వ్యవహరించేదని నేను గట్టిగా మాట్లాడాను".
వివరాలు
వ్యక్తి రాయితో కారును ధ్వంసం చేయాలని ప్రయత్నించాడు
అయితే, అక్కడికి ఇంకా చాలామంది వ్యక్తులు చేరుకుని వారిని దూషించడం మొదలుపెట్టారని, ఒక వ్యక్తి రాయితో కారును ధ్వంసం చేయాలని, తన తలపై దాడి చేయాలని ప్రయత్నించినట్లు బోస్ వివరించారు.
ఈ పరిణామాలపై ఆయన భార్య వెంటనే అప్రమత్తమై తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు చెప్పారు.
అక్కడ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా స్పందన తక్కువగా కనిపించిందని,రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండటం తనను ఆశ్చర్యానికి గురి చేసినట్లు ఆయన వీడియోలో పేర్కొన్నారు.