Page Loader
Bangalore Stampede: బెంగళూరు నగర పోలీసు కమిషనర్ తోపాటు పలువురు పోలీసులు సస్పెండ్.. కొత్త క‌మీష‌న‌ర్‌గా సీమంత్ కుమార్ సింగ్‌
బెంగళూరు నగర కొత్త క‌మీష‌న‌ర్‌గా సీమంత్ కుమార్ సింగ్‌

Bangalore Stampede: బెంగళూరు నగర పోలీసు కమిషనర్ తోపాటు పలువురు పోలీసులు సస్పెండ్.. కొత్త క‌మీష‌న‌ర్‌గా సీమంత్ కుమార్ సింగ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరు నగరంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవ వేడుకల సమయంలో జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాట సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు, అంతేకాకుండా పలువురు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన నిర్లక్ష్యాలకు కారణమైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అందుకు అనుగుణంగా, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద్ సహా మరో నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల జాబితాను పరిశీలిస్తే, తొక్కిసలాట ఘటనలో భద్రతా ఏర్పాట్ల విఫలం వల్ల ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

వివరాలు 

కొత్త క‌మీష‌న‌ర్‌గా సీమంత్ కుమార్ సింగ్‌

ఈ సస్పెన్షన్ ఆదేశాలలో బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద్, అదనపు పోలీసు కమిషనర్ (అడ్మిన్) వికాస్ కుమార్,సెంట్రల్ డిసిపి టి. శేఖర్,కబ్బన్ పార్క్ ఏసిపి బాలకృష్ణ, కబ్బన్ పార్క్ పోలీస్ ఇన్స్పెక్టర్ గిరీష్ సహా ఇతర అధికారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి న్యాయ విచారణ నిర్వహించమని ఆదేశించింది. ఘటన సంభవించిన విధానం, భద్రతా ఏర్పాట్ల లోపాలు, ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వంటి అంశాలపై దర్యాప్తు జరగనుంది అని సీఎం స్పష్టం చేశారు. ఇక, బెంగళూరు సిటీకి కొత్త పోలీసు కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి సీమంత్ కుమార్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. టీవీ రిపోర్టర్లతో మాట్లాడుతూ, పూర్వ క‌మీష‌న‌ర్ల త‌ర‌హాలో తాను ప‌నిచేయ‌నున్న‌ట్లు చెప్పారు.