తదుపరి వార్తా కథనం

Telangana: బంగినపల్లి మామిడి రికార్డు ధర.. టన్ను రూ.1.22 లక్షలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 21, 2025
02:08 pm
ఈ వార్తాకథనం ఏంటి
వరంగల్ ఎనుమాముల ముసలమ్మకుంటలో గురువారం ప్రారంభమైన కొత్త మామిడి మార్కెట్‌లో తొలిరోజు బంగినపల్లి మామిడి రికార్డు ధర సాధించింది.
మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డా. సత్యశారద సమక్షంలో మార్కెట్‌లో తొలిసారిగా మామిడి వేలంపాట నిర్వహించగా, వ్యాపారులు భారీగా హాజరయ్యారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్లకు చెందిన విజయపాల్ రెడ్డి తీసుకొచ్చిన బంగినపల్లి మామిడిని టన్నుకు రూ.1.22 లక్షలకు కొనుగోలు చేశారు.
మార్కెట్ చరిత్రలో మామిడికి ఇంత భారీ ధర పలకడం ఇదే మొదటిసారని అధికారులు వెల్లడించారు.