
ECI: బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఓటర్లకు అవగాహన
ఈ వార్తాకథనం ఏంటి
రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
తాజాగా ఓటు హక్కు, ఎన్నికలపై ఎక్కువ మందికి అవగాహన కల్పించేలా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (DoP)తో భారత ఎన్నికల సంఘం (ECI) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ సమక్షంలో ఈ ఎంఓయూ జరిగింది.
ఈ క్రమంలో 2024 లోక్‌సభ ఎన్నికల వేళ.. ఓటర్లలో చైతన్యం కల్పించేందుకు ఎన్నికల సంఘం పోస్టాఫీసులు, బ్యాంకులను వేదికలుగా చేసుకోనుంది.
ఎన్నికలు
దేశంలో 1.6 లక్షల బ్యాంకు శాఖలు
దేశవ్యాప్తంగా 1.6 లక్షల బ్యాంకు శాఖలు, 2 లక్షలకు పైగా ఏటీఎంలు, 1.55 లక్షల పోస్టాఫీసుల ఉన్నాయి.
వీటికి నిత్యం లక్షాది మంది వినియోగదారులు వస్తుంది. దీంతో ఓటర్లను చైచన్య పర్చేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులు మంచి వేదిక అవుతాయని ఎన్నికల సంఘం భావిస్తోంది.
ఇదిలా ఉంటే, ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన పెంచుకునేందుకు ఈసీ ఇటీవల విద్యా మంత్రిత్వ శాఖతో ఎంఓయూ కుదుర్చుకుంది.
దీంతో విద్యాశాఖ విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఎన్నికల అంశాన్ని చేర్చనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎన్నికల సంఘం ట్వీట్
Banks and Post Offices will now carry out voter awareness campaigns across the country. MoU signed with IBA and Postal Department today.
— Spokesperson ECI (@SpokespersonECI) February 26, 2024
ECI #SVEEP messaging will reach a wide audience through 1.6 lakh bank branches, over 2 lakh ATMs & 1.55 lakh Post Offices #ChunavKaParv pic.twitter.com/wEqsHzZPaZ