LOADING...
Vijay Mallya: ఇచ్చిన రుణం కన్నా.. ఎక్కువ మొత్తంలో వసూలు.. కోర్టుకెక్కిన విజయ్‌ మాల్య
ఇచ్చిన రుణం కన్నా.. ఎక్కువ మొత్తంలో వసూలు.. కోర్టుకెక్కిన విజయ్‌ మాల్య

Vijay Mallya: ఇచ్చిన రుణం కన్నా.. ఎక్కువ మొత్తంలో వసూలు.. కోర్టుకెక్కిన విజయ్‌ మాల్య

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

తనపై బ్యాంకులు అన్యాయంగా రుణాల కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేశాయని విదేశాల్లో ఉంటున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా ఆరోపించారు. తాను చెల్లించిన అసలు మొత్తం, వడ్డీపై మళ్లీ కొత్తగా వడ్డీ విధించడం జరుగుతోందని పేర్కొంటూ కర్ణాటక హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్‌ పరిధిలో పనిచేసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన రుణాల వివరాలు, బకాయిల స్పష్టతను బ్యాంకులు విడుదల చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ జస్టిస్ కన్నెగంటి లలిత ధర్మాసనం ఎదుట మంగళవారం విచారణకు వచ్చింది.

వివరాలు 

కేంద్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ

తన నుంచి రూ.10 వేల కోట్లు వసూలు చేసినట్లు రుణ వసూలు ట్రైబ్యునల్ నివేదికలో పేర్కొనగా, కేంద్ర ఆర్థిక మంత్రి మాత్రం లోక్‌సభలో రూ.14 వేల కోట్లు వసూలు చేశామని వెల్లడించిన విషయం మాల్య గుర్తుచేశారు. ఇప్పటికే చెల్లించిన రుణాలపైనా తిరిగి వడ్డీ విధిస్తున్నారని మాల్య తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి రుణాలు ఇచ్చిన బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసి తదుపరి విచారణను వాయిదా వేశారు.