
Banu Mushtaq: 'హార్ట్‌ల్యాంప్' కన్నడ రచయిత్రి బాను ముస్తాక్'కు ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్
ఈ వార్తాకథనం ఏంటి
2025 బుకర్ ప్రైజ్ అనే అంతర్జాతీయ స్థాయిలో అత్యంత గౌరవనీయమైన సాహిత్య పురస్కారాన్ని ఈసారి కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ అందుకున్నారు.
ఆమె రచించిన చిన్న కథల సంపుటి 'హార్ట్ ల్యాంప్'కి ఈ పురస్కారం లభించింది.
ఈ ఘనత సాధించిన తొలి కన్నడ సాహిత్యకారిణిగా బాను ముస్తాక్ చరిత్రలో నిలిచారు.
బాను ముస్తాక్ ముస్లిం కుటుంబంలో జన్మించారు. పాఠశాల దశలోనే తాను రచనల పట్ల ఆసక్తి పెంచుకొని, మొదటిసారి ఓ చిన్న కథను రాశారు.
కానీ, ఆమె రాసిన కథ 26 ఏళ్ల వయసులోనే ఒక పత్రికలో ప్రచురితమై, సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
ఆమె తండ్రి ప్రోత్సాహంతో చదువులో మంచి ప్రగతిని సాధించి, కన్నడ భాషపై ప్రగాఢమైన అవగాహనను పెంచుకున్నారు.
వివరాలు
సాహిత్య సేవలకు గుర్తింపుగా కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు
అనంతరం బాను రిపోర్టర్‌గా, లాయర్‌గా తన వృత్తి జీవితాన్ని కొనసాగించారు.
కానీ ఆమెకు రచయితగా మాత్రమే కాకుండా, మహిళల హక్కుల కోసం పోరాడే సామాజిక కార్యకర్తగా కూడ గుర్తింపు లభించింది.
మతం లేదా సమాజం మహిళలపై విధించే ఆంక్షలను, ఆపాదించే నియమాలను ఆమె కథల ద్వారా తీవ్రంగా ప్రశ్నించారు.
మహిళలు ఎదుర్కొంటున్న బాధలను, వారు ఎదుర్కొంటున్న సంఘర్షణలను ఆమె రచనలలో ప్రతిబింబించారు.
'హార్ట్ ల్యాంప్' కథా సంపుటితో పాటు బాను ముస్తాక్ మొత్తం ఆరు చిన్న కథల సంకలనాలు, ఒక నవల, ఇంకా పలు ఇతర రచనలు చేశారు.
ఆమె సాహిత్య సేవలకు గుర్తింపుగా కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు, 'దాన చింతామణి అతిమబ్బె' అనే ప్రత్యేక బహుమతిని అందుకున్నారు.