Kerala: హిమాలయాలను దాటి వయనాడ్‌లో దర్శనమిచ్చిన 'బార్ హెడెడ్ గూస్'
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 23, 2026
11:19 am
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలోని వయనాడ్ జిల్లాలో తొలిసారిగా 'బార్ హెడెడ్ గూస్' కనిపించిందని ఏషియన్ వాటర్‌బర్డ్ సెన్సెస్ సర్వే ధ్రువీకరించింది. సాధారణంగా ఈ పక్షులు హిమాలయ ప్రాంతాల్లో కనిపిస్తాయి. టిబెటన్ పీఠభూమిలో సంతానోత్పత్తి కోసం వలస వెళ్తాయి. వీటి తల వెనుక రెండు నల్లని కడ్డీలాంటి ప్రత్యేక గుర్తులు ఉన్నందున వీటిని బార్ హెడెడ్ గూస్ అని పిలుస్తారు. శీతాకాలంలో హిమాలయాలను దాటి దక్షిణాసియాలోని ప్రాంతాలకు వలస వస్తాయి. ఈ క్రమంలోనే వయనాడ్ చేరాయని సర్వేలో పాల్గొన్న డాక్టర్ ఆర్.ఎల్.రతీశ్ తెలిపారు. ఆధునిక పరిశీలనల ప్రకారం ఇవి అతితక్కువ ఆక్సిజన్ స్థాయులున్న అత్యంత ఎత్తైన ప్రాంతాల్లోనూ (సుమారు 29,000 అడుగులు) ఎగరగలవు. ఈ అసాధారణ సామర్థ్యానికి వీటికి ప్రత్యేకమైన 'హెమోగ్లోబిన్ రకం' తోడ్పడుతుందని ఆయన వెల్లడించారు.