Page Loader
ప్రదాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: 'వలసవాద ఆలోచనా ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది'
మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ఖండించిన భారత్

ప్రదాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: 'వలసవాద ఆలోచనా ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది'

వ్రాసిన వారు Stalin
Jan 19, 2023
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని మోదీపై ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని భారత్ తీవ్రంగా స్పందించింది. అపఖ్యాతితో కూడుకున్న కథనాన్ని ముందుకు తీసుకురావడానికి రూపొందించబడిన ప్రచారాస్త్రంగా కనపడుతోందని చెప్పింది. మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించడం వెనుక పక్షపాతం, వలసవాద ఆలోచనా ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. ఈ డాక్యుమెంటరీని రూపొందించడం వెనుక 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశ్నించే ఎజెండా ఉందని బాగ్చి స్పష్టం చేశారు. భారత్‌లో దీన్ని ఇప్పటి వరకు ప్రదర్శించబడలేదనే విషయాన్ని అందరూ గమనించాలని సూచించారు.

మోదీ

ఈ డాక్యుమెంటరీ ఆ మీడియా సంస్థ ప్రతిబింబంలా కనిపిస్తోంది: బాగ్చి

భారత ప్రధాన మంత్రిపై రూపొందించిన ఈ డాక్యుమెంటరీ సంబంధింత ఆ మీడియా లేదా వ్యక్తుల ప్రతిబింబం అని అరిందమ్ బాగ్చి ఆరోపించారు. ఇలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. బీబీసీ డాక్యుమెంటరీ పట్ల భారతీయులతో పాటు ప్రవాసులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్‌లోని సమస్యలపై బీబీసీ యూకే దృష్టి పెట్టాలని ఒకరు ట్విట్టర్‌లో కామెంట్ పెట్టారు. అంతకుముందు యూకే పార్లమెంట్‌ లో కూడా బీబీసీ డాక్యుమెంటరీపై చర్చ జరిగింది. దీన్ని హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు లార్డ్ రామి రేంజర్ వ్యతిరేకించారు. ఒక బిలియన్ మందికి భారతీయులకు ఇది బాధకలిగించే విషయంగా ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన భారత న్యాయవ్యవస్థను అవమానిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.