LOADING...
Firecrackers: దీపావళికి ముందే.. బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి: పోలీసుల హెచ్చరిక!
దీపావళికి ముందే.. బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి: పోలీసుల హెచ్చరిక!

Firecrackers: దీపావళికి ముందే.. బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి: పోలీసుల హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2025
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

దీపావళి పండుగ సందర్భంగా పోలీసులు అప్రమత్తత అయ్యారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాణసంచా విక్రయించడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసే దుకాణాలు కూడా లైసెన్స్ పొందడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రతి దుకాణదారుడు 1884లో వచ్చిన పేలుడు పదార్థాల చట్టం, 1983 (2008 లో సవరణ) పేలుడు నియమాలు ప్రకారం లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్‌ను జిల్లా పోలీసు శాఖకు చెందిన జోనల్ డిప్యూటీ కమిషనర్లు జారీ చేస్తారు. అక్టోబర్ 16వ తేదీకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దరఖాస్తులు 'cybpms.telangana.gov.in' లేదా 'cyberabadpolice.gov.in' వెబ్‌సైట్‌ల ద్వారా చేసుకోవచ్చు.