Page Loader
బ్రిక్స్ నోటిఫికేషన్‌లోనే తొలిసారిగా భారత్‌ ప్రస్తావన.. ఇప్పటికే ఈ పేరును ఎన్నిసార్లు వాడారో తెలుసా
ఇప్పటికే ఈ పేరును ఎన్నిసార్లు వాడారో తెలుసా

బ్రిక్స్ నోటిఫికేషన్‌లోనే తొలిసారిగా భారత్‌ ప్రస్తావన.. ఇప్పటికే ఈ పేరును ఎన్నిసార్లు వాడారో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 06, 2023
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

G-20 శిఖరాగ్ర సమావేశంలో అతిథులను విందుకు ఆహ్వానించే క్రమంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పదాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఇది కేంద్రానికి కొత్తేం కాదు. ఇటీవలే దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్‌ సదస్సులోనూ 'భారత్‌' అనే పేరును ఉపయోగించారు. ప్రెసిడెంట్‌ ఆప్‌ భారత్‌ పేరిట రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఇవ్వడంపై ప్రస్తుతం దేశం వ్యాప్తంగా రాజకీయ ప్రకంపణలు కొనసాగుతున్నాయి. G-20 సదస్సు నేపథ్యంలో విదేశీ దేశాధినేతలకు ప్రెసిడెంట్ ద్రౌపదిే ముర్ము పంపిన విందు ఆహ్వాన లేఖలో ఇండియా స్థానంలో భారత్‌ అని పేర్కొనడం ఇది మూడోసాేరి. ఆగస్టులో దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్‌ సమావేశ నోటిఫికేషన్‌లో 'భారత్‌' పేరును తొలిసారిగా వాడారు.ఈ మేరకు 'ది ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌' అని ప్రస్తావించారు.

DETAILS

జీ20 దేశాల ఆహ్వాన పత్రాల్లో భారత్‌, ద మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీగా కేంద్రం ప్రకటించింది

ఆగస్ట్ 22-25 మధ్యలో గ్రీస్ పర్యటనలో భాగంగా ఇరుదేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లో భారత్ పేరును స్పష్టంగా పొందుపర్చారు. దీంతో రెండోసారి ఆ పేరును వాడినట్టైంది. తాజాగా ప్రధాని మోదీ పాల్గొననున్న తూర్పు ఆసియా సదస్సు, ఇండోనేషియాలో ఏషియన్‌ ఇండియా సదస్సుల నోటీసుల్లోనూ 'ది ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌' అని నాల్గొసారి ఉపయోగించారు. G-20 విదేశీ అతిథులకు పంపిణీ చేస్తున్న పుస్తకాల్లోనూ భారత్‌ అనే ముద్రించారు. ఈ క్రమంలోనే 'భారత్‌, ద మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ'గా ప్రకటించింది. రాజ్యాంగంలో ఇండియా అంటే భారత్‌, భారత్‌ అంటే ఇండియా అని ఉన్నట్లు పేర్కొన్న కేంద్ర ఉన్నతాధికారులు, ఈ మేరకు ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ఇందుకు సంబంధించి తీర్మానం చేయాల్సిన ఆవశ్యకత కూడా లేదన్నారు.