Page Loader
PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి చివరి సమావేశం 
PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి చివరి సమావేశం

PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి చివరి సమావేశం 

వ్రాసిన వారు Stalin
Mar 03, 2024
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం కేంద్రం మంత్రి మండలి సమావేశం జరగనుంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కేబినెట్ మీటింగ్‌కు ప్రధాన్యత సంతరించుకొన్నది. అంతేకాకుండా, మోదీ 2.0 ప్రభుత్వంలో ఇదే చివరి కేబినేట్ సమావేశం కావడం గమనార్హం. పాలసీ, పాలన సంబంధిత అంశాలపై చర్చించేందుకు ప్రధాని మోదీ వారానికి ఒకసారి మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఏప్రిల్-మేలో జరగనున్న లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ఆదివారం జరగనున్న ఈ సమావేశం రాజకీయంగా చాలా కీలకం కానున్నది.

మోదీ

మార్చి 13 తర్వాత ఈసీ షెడ్యూల్

రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం అధికార బీజేపీ 195మంది అభ్యర్థులతో శనివారం తొలి జాబితాను విడుదల చేసిన ఒక రోజు తర్వాత మోదీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. తొలి జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుంచి మళ్లీ పోటీ చేయనున్న ప్రధాని మోదీ, గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీ చేయనున్న అమిత్ షా వంటి ప్రముఖ పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలో 34మంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. మార్చి 13తర్వాత ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, మోదీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నేతృత్వంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) విశ్వాసం వ్యక్తం చేస్తోంది.