LOADING...
Bengal Governor: ప‌శ్చిమ బెంగాల్ సీఎంపై.. గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్ ప‌రువునష్టం కేసు 
ప‌శ్చిమ బెంగాల్ సీఎంపై.. గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్ ప‌రువునష్టం కేసు

Bengal Governor: ప‌శ్చిమ బెంగాల్ సీఎంపై.. గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్ ప‌రువునష్టం కేసు 

వ్రాసిన వారు Stalin
Jun 29, 2024
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్ ప‌రువునష్టం కేసు న‌మోదు చేశారు. కోల్‌క‌తా హైకోర్టులో ఆయ‌న ఆ పిటిష‌న్ ఫైల్ చేశారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సమావేశంలో, బెనర్జీ గురువారం మాట్లాడారు. "ఇటీవలి సంఘటనల కారణంగా రాజ్‌భవన్‌ను సందర్శించడానికి తాము భయపడుతున్నామని మహిళలు తనకు తెలియజేశారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై "గవర్నర్ సివి ఆనంద బోస్ శుక్రవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమె పార్టీ నాయకులపై పరువు నష్టం దావా వేశారు" అని పిటిఐకి తెలిపారు.

వివరాలు 

మహిళా ఉద్యోగిపై బోస్ వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు

మే 2న, రాజ్‌భవన్‌లోని ఒక కాంట్రాక్టు మహిళా ఉద్యోగిపై బోస్ వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కోల్‌కతా పోలీసులు విచారణ ప్రారంభించారు. టిఎంసి రాజ్యసభ ఎంపి డోలా సేన్‌ను సంప్రదించినప్పుడు, పార్టీ నాయకత్వంతో చర్చించకుండా ఈ విషయంపై తాను వ్యాఖ్యానించలేనని అన్నారు.