Page Loader
బెంగళూరు: ఇంటర్‌లో 90శాతం మార్కులు లేవని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు
బెంగళూరు: ఇంటర్‌లో 90శాతం మార్కులు లేవని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు

బెంగళూరు: ఇంటర్‌లో 90శాతం మార్కులు లేవని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు

వ్రాసిన వారు Stalin
Apr 27, 2023
09:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి ఇల్లు అద్దెకు ఇచ్చే యజమానుల గురించి ఎప్పుడైనా విన్నారా? బెంగళూరులో అద్దెకోసం ఇల్లును వెతుకున్న వ్యక్తికి ఆ వింత అనుభవం ఎందురైంది. మంచి మార్కులు లేనిది, ఫ్లాట్ అద్దెకు ఇవ్వడం కుదరదంటూ జరిగిన ఓ వాట్సాప్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. బెంగళూరులో అద్దె కోసం ఫ్లాట్‌ను వెతుకున్న వ్యక్తి ఒక బ్రోకర్‌ను స్పందించాడు. బ్రోకర్ ఆ వ్యక్తి ప్రొఫైల్‌ను ఫ్లాట్ యజమానికి పంపండతో అతను అంగీకరించాడు. ఈ విషయాన్ని వాట్సాప్ ద్వారా ఆ వ్యక్తికి బ్రోకర్ తెలియజేశాడు.

బెంగళూరు

ఫ్లాట్ మంజూరు చేయడానికి మార్క్ షీట్లను అడిగిన బ్రోకర్ 

సోషల్ మీడియా ప్రొఫైల్‌లు, జాయినింగ్ లెటర్, అతని 10వ తరగతి, 12వ మార్క్ షీట్‌లు, ఆధార్, పాన్ కార్డ్‌తో సహా ఇతర పత్రాలను ఫ్లాట్ యజమాని అడిగినట్లు బ్రోకర్ ఆ వ్యక్తికి వాట్సాప్ ద్వారా తెలియజేశాడు. అంతేకాకుండా అద్దెకు ఉండే వ్యక్తి సెల్ఫ్ ప్రొఫైల్‌ను 150-200పదాలను రాయమని ఫ్లాట్ యజమాని చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని బ్రోకర్ వాట్సాప్ చాటా ద్వారా వినియోగదారుడికి చెప్పాడు. ఫ్లాట్ యజమాని అడిగినట్లే వినియోగదారుడు అన్ని వివరాలను బ్రోకర్‌కు పంపాడు. ఆ తర్వాత బ్రోకర్ ఆ వివరాలను యజమానికి పంపాడు.

బెంగళూరు

ఇంటర్ మార్కులు సరిగా లేవని ప్రొఫైల్‌ను తిరస్కరించిన యజమాని 

వినియోగదారుడి అన్ని వివరాలను పరిశీలించిన ఫ్లాట్ యజమాని బ్రోకర్‌కు ఖంగుతినే సమాధానం చెప్పారు. ఫ్లాట్ యజమాని చెప్పిన విషయాన్ని వాట్సాప్ చాట్ ద్వారా బ్రోకర్ అద్దెదారుడికి ఇలా వాట్సాప్ మెసేజ్ చేశాడు. 'క్షమించండి, అతను(యజమాని) మీ ప్రొఫైల్‌ని తిరస్కరించాడు. ఎందుకంటే మీరు 12వ తరగతిలో 75% సాధించారు. యజమాని కనీసం 90శాతం ఆశిస్తున్నారు' అని బ్రోకర్ అద్దెదారుడికి చెప్పాడు. ఇది చూసిన ఆ వ్యక్తి షాక్ గురయ్యాడు. బ్రోకర్‌కు తనకు మధ్య జరిగిన సంభాషణను వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు చేయగా నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా స్పందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బ్రోకర్, వినియోగదారుడికి మధ్య జరిగిన వాట్సాప్ చాట్