LOADING...
Bengaluru ATM Cash Van Robbery: బెంగళూరులో ఏటీఎం క్యాష్‌ వెహికల్‌ నుంచి రూ.7.11 కోట్లు దోపిడీ.. ఏపీలో వాహనం లభ్యం
ఏపీలో వాహనం లభ్యం

Bengaluru ATM Cash Van Robbery: బెంగళూరులో ఏటీఎం క్యాష్‌ వెహికల్‌ నుంచి రూ.7.11 కోట్లు దోపిడీ.. ఏపీలో వాహనం లభ్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2025
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులో ఏటీఎం కోసం తీసుకెళ్తున్న నగదు వాహనం నుంచి మధ్యాహ్నం వేళే రూ.7.11 కోట్లను అపహరించిన ఘటన అక్కడ పెద్ద సంచలనంగా మారింది. ఈ దొంగతనం వెనుక ఆంధ్రప్రదేశ్‌ కనెక్షన్లు ఉన్నట్లు కర్ణాటక పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలు ఉపయోగించిన వాహనాన్ని చిత్తూరు జిల్లాలో వదిలేసి అక్కడినుంచి పరారైనట్టు తేలింది. యుపి రిజిస్ట్రేషన్‌ ఉన్న ఇన్నోవా (UP 14 BX 2500) లో నగదును తీసుకెళ్లిన దుండగులు, ఆ కారును చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రామాపురం చర్చ్ దగ్గర పారేసినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ వాహనాన్ని ఖాళీ చేసి, డబ్బును మరో కారులోకి మార్చుకుని వెళ్లిపోయినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది.

వివరాలు 

చిత్తూరు జిల్లాలో వాహనాన్ని వదిలేసి పారిపోయిన దొంగలు.. 

సీసీటీవీ విజువల్స్ పరిశీలించిన పోలీసులు, ఆ వాహనం ముందుగా గుడిపాల మండల కేంద్రం గుండా వెళ్లి చిత్తపార గ్రామం దిశగా వెళ్లి,కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చినట్లు నిర్ధారించారు. దొంగలు రిజర్వ్ బ్యాంక్ లేదా ఆదాయపన్ను విభాగం అధికారులమని నమ్మేలా చేసి,ఏటీఎంలకు డబ్బు తీసుకెళ్తున్న క్యాష్ వాన్‌ను ఆపి తనిఖీ పేరుతో సిబ్బందిని దిగమని చెప్పి,కేంద్రప్రభుత్వ స్టిక్కర్ ఉన్న వాహనంలో నగదును మార్చి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈవ్యవహారంలో సమీప గ్రామాల వారిలో కొందరి ప్రమేయం ఉండొచ్చని భావించిన కర్ణాటక పోలీసులు,చిత్తూరు పోలీసులతో కలిసి అర్ధరాత్రి చిత్తపార గ్రామపరిసరాల్లో సోదాలు చేశారు. అపహరించిన ఈ భారీ మొత్తాన్ని దొంగలు ఏ వాహనంలో ఎటువైపు తరలించారన్న దానిపై ప్రస్తుతం కర్ణాటక పోలీసులు తీవ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.