Loading...
Bengaluru: బెంగళూరులో దారుణం.. భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య
బెంగళూరులో దారుణం.. భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య

Bengaluru: బెంగళూరులో దారుణం.. భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ క్యాబ్ డ్రైవర్ తన భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన మరో ఆరుగురిని హత్య చేశాడు. మొత్తం ఏడుగురిని పొట్టనపెట్టుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటం, భార్య కుటుంబ సభ్యులు ఆమెకు మద్దతుగా నిలవడం నిందితుడికి ఆగ్రహం తెప్పించింది. దీంతో వారిపై కక్ష పెంచుకున్న ఇందుశేఖర్ ఈ దారుణాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

వివరాలు 

వివాదాలను పరిష్కరించేందుకు..

బెంగళూరులోని రాజాజీనగర్‌లో నివసిస్తున్న ఇందుశేఖర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

సుమారు రెండు దశాబ్దాల క్రితం సునితను వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ వివాదాలను పరిష్కరించేందుకు సునిత తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ప్రయత్నించేవారు.

మరోవైపు సునిత తన తల్లితో సన్నిహితంగా ఉండటంతో పాటు, ఆమె సోదరులు కూడా ఆమెకు అండగా నిలిచేవారు.

ఇది ఇందుశేఖర్‌కు నచ్చలేదు. తన కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే కోపంతో వారందరినీ హత్య చేయాలని పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.

వివరాలు 

ముందుగా భార్యను హత్య చేసి..

పోలీసుల కథనం ప్రకారం.. ఇందుశేఖర్ తొలుత భార్య సునితను హత్య చేశాడు. ఓ బండరాయితో ఆమె తలపై బలంగా మోదడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

అనంతరం మృతదేహాన్ని నంది హిల్స్ ప్రాంతానికి తీసుకెళ్లి పూడ్చిపెట్టాడు.

ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు సునిత తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిందని ఇరుగుపొరుగు వారిని నమ్మించాడు.

ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుందని చెప్పి అనుమానం రాకుండా వ్యవహరించాడు.

ADVERTISEMENT

వివరాలు 

ఒక్కొక్కరిని ఇంటికి పిలిచి హత్యలు

భార్య హత్య తర్వాత ఆమె కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా ఇంటికి ఆహ్వానించి హత్యలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

తొలుత తన బామ్మర్దులు శివకుమార్, శంకర్‌లను ఇంటికి పిలిచాడు.

కలిసి మద్యం సేవిద్దామని చెప్పి వారిని హత్య చేశాడు. ఆ తర్వాత వారి భార్యలు నళిని, దివ్యలను కూడా చంపేశాడు.

అనంతరం అత్త రూపవతితో పాటు శంకర్ ఏడేళ్ల కుమారుడు పునీత్‌ను కూడా హతమార్చాడు.

ఇలా భార్యతో సహా మొత్తం ఏడుగురిని దారుణంగా చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మృతదేహాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఆధారాలు దొరక్కుండా ఇంటిని శుభ్రం

హత్యల అనంతరం ఆధారాలు బయటపడకుండా ఇందుశేఖర్ జాగ్రత్తలు తీసుకున్నాడు.

ఇంట్లో రక్తపు మరకలు, ఇతర ఆనవాళ్లు తొలగించేందుకు రసాయనాలతో శుభ్రం చేసేవాడు.

హత్యకు ఉపయోగించిన బండరాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మృతదేహాలను తరలించేందుకు ఉపయోగించిన కారును కూడా సీజ్ చేశారు.

నంది హిల్స్ ప్రాంతంలో పూడ్చిపెట్టిన చిన్నారి పునీత్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. మిగిలిన వారి మృతదేహాల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

వివరాలు 

కుమార్తె ఫిర్యాదుతో వెలుగులోకి హత్యల మిస్టరీ

నళిని తల్లి తన కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్యల వ్యవహారం బయటపడింది.

విచారణ సమయంలో ఇందుశేఖర్ ఇచ్చిన పొంతనలేని సమాధానాలు పోలీసులకు అనుమానం కలిగించాయి.

దీంతో అతడిపై దృష్టి సారించి విచారించగా హత్యల విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

భార్యతో తరచూ గొడవలు జరగడం, ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు మద్దతుగా నిలవడమే ఈ హత్యలకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ కేసులో ఇందుశేఖర్ కుమార్తెను కూడా పోలీసులు విచారించనున్నారు.

ADVERTISEMENT