Bengaluru: బెంగళూరు రాక్షస తల్లి కొడుకును ఎలా చంపిందో తలుసా?.. పోస్టుమార్టంలో రిపోర్డులో షాకింగ్ నిజాలు
బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడి హత్య చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిన్నారి హత్యకు సంబంధించిన పోస్టుమార్టం నివేదిక బుధవారం పోలీసులకు అందింది. పోస్టుమార్టం నివేదికలో వైద్యులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ ఘటన జనవరి 6 నుంచి 8 మధ్య జరిగినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. కర్నాటకలో పోస్ట్‌మార్టం నిర్వహించిన ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ కుమార్ నాయక్ మాట్లాడుతూ.. చిన్నారి హత్య జరిగి 36 గంటల కంటే ఎక్కువైందన్నారు. అలాగే బాలుడి హత్య ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
గోవాలో చిన్నారి హత్య
బాలుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, హత్య కోసం దిండు కానీ, టవల్ కానీ ఉపయోగించడం వల్ల చిన్నారి ఊపిరి ఆడక చనిపోయినట్లు డాక్టర్ కుమార్ నాయక్ తెలిపారు. చిన్నారిని చేతులతో గొంతు నులిమి హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపించడం లేదన్నారు. జనవరి 6న సుచనా సేథ్ తన కొడుకుతో కలిసి గోవా వెళ్లింది. అక్కడే చిన్నారిని హత్య చేసింది. ఆ తర్వాత ఆమె అతని మృతదేహాన్ని ఒక బ్యాగ్‌లో ప్యాక్ చేసి టాక్సీలో గోవా నుంచి బయలుదేరింది. హోటల్ సిబ్బంది సిబ్బంది గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా టవల్‌పై రక్తపు మరకలు కనిపించాయి. సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
బ్యాగ్‌లో చిన్నారి మృతదేహం
పోలీసులు సుచనాను పిలిపించి రక్తపు మరకలపై ప్రశ్నించగా.. అది పీరియడ్ బ్లడ్ అని చెప్పింది. కొడుకు గురించి అడిగితే.. తాను స్నేహితురాలితో ఉన్నానని బదులిచ్చింది. తన స్నేహితుడి వద్ద తన కొడుకు ఉన్నాడని సుచనా పోలీసులకు చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు టాక్సీ డ్రైవర్‌ను పిలిపించి విచారించారు. ఈ క్రమంలో టాక్సీ సుచనా బ్యాగ్‌ను పరిశీలించగా.. అందులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో పోలీసులు సుచనా సేథ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 2010లో వెంకట్ రామన్‌ను సుచన వివాహం చేసుకుంది. వీరికి 2019లో ఒక కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.