Bengaluru: ఉచిత టొమాటోలను పంపినందుకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై మండిపడిన బెంగళూరు వ్యక్తి
ఈ రోజుల్లో మనం ఆన్‌లైన్‌లో ఏది ఆర్డర్ చేస్తే అది నేరుగా మన ఇంటికి వస్తుంది. అయితే, ఆర్డర్ చేసిన వస్తువులతో పాటు, ఆర్డర్ చేయనివి కూడా వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మనకు అవసరం లేని వస్తువులు ఉచితంగా పంపించినా, వాటి వల్ల కొంత చిరాకు కలుగుతుంది. ఇటువంటి అనుభవమే బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తికి ఎదురైంది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో అతను కొన్ని కావలసిన పదార్థాలను ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్ లో భాగంగా అతడికి అరకిలో టమాటాలు కూడా వచ్చాయి. యాప్‌లో టమాటాలు ఉచితంగా ఇవ్వబడుతున్నట్లు పేర్కొనబడింది.
సామాజిక మాధ్యమాల్లో ట్వీట్ వైరల్
అయితే, టమాటాలను ఆర్డర్ చేయకపోయినా తనకు బలవంతంగా పంపారంటూ ఆ వ్యక్తి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆర్డర్ సమయంలో తన కార్ట్ నుంచి ఆ అనవసర వస్తువును తొలగించే ఆప్షన్ కూడా లేదని, ఇది తగిన విధానం కాదని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి అనవసర ఉచిత సర్వీసులు కస్టమర్లకు ఇబ్బంది కలిగిస్తాయని, ఈ విధానం సరిగా లేదని, స్విగ్గీ అందిస్తున్న ఈ విధానం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. టమాటాలు ఉచితంగా పంపించడమే సమస్య కాదని, కానీ తాను కోరుకున్న పదార్థాలను మాత్రమే ఆర్డర్ చేయగల స్వేచ్ఛ ఉండాలనేది తన అభిప్రాయం. అతని ఈ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.