
Bengaluru rave party : ఇద్దరు తెలుగు నటులకు డ్రగ్ పాజిటివ్: పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో 103మందికి డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.
పలువురు నటుల రక్త నమూనాల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు లభ్యమైనట్లు తెలిపారు.వారిలో ఇద్దరు తెలుగు నటులు కూడా ఉన్నట్లు చెప్పారు.
వీరికి నోటీసులు పంపి విచారణకు పిలిచేందుకు సీసీబీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులు సిద్ధమవుతున్నారు.
తాను హైదరాబాద్‌లో ఉన్నానని,రేవ్ పార్టీలో లేనంటూ ఓ తెలుగు నటి బెంగళూరులో వీడియో తీసింది.అయితే, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న రేవ్ పార్టీలో ప్రముఖ తెలుగు నటి నిజంగానే ఉందని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానంద తర్వాత ప్రకటించారు.
మరో ప్రముఖ తెలుగు నటి తాను పార్టీకి హాజరయ్యానని ఒప్పుకుంది,అయితే లోపల ఏమి జరుగుతుందో తనకు తెలియదని తెలిపింది.
Details
ఐదుగురు వ్యక్తులు అరెస్టు
మే 20న 'సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ' పేరుతో జరిగిన రేవ్ పార్టీకి టెక్కీలు,తెలుగు నటీనటులు, తదితరులతో సహా దాదాపు 100 మంది హాజరైన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు.
పార్టీకి హాజరైన వారు ఎండీఎంఏ, కొకైన్, హైడ్రో గంజా, ఇతర పదార్థాలను వినియోగించారని ఆరోపించారు.
ఫామ్‌హౌస్‌లో మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న కర్ణాటక పోలీసులు, డ్రగ్స్ సరఫరాతో పాటు సెక్స్ రాకెట్ కూడా పనిచేస్తుందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
Details
కర్ణాటకను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: పరమేశ్వర
పోలీసు శాఖ దర్యాప్తును ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్ నుండి సిటీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) నార్కోటిక్స్ విభాగానికి బదిలీ చేసింది.
కర్ణాటకను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, రేవ్ పార్టీలను సహించేది లేదని హోంమంత్రి జి.పరమేశ్వర అన్నారు.
చదువుల కోసం కర్ణాటకకు వచ్చి మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా చేసే విద్యార్థులపై నిఘా ఉంచామని, వారిని వారి రాష్ట్రాలకు పంపిస్తామని హెచ్చరించారు.