LOADING...
Bengaluru: ప్రపంచంలో రెండవ అత్యంత రద్దీ నగరం బెంగళూరు: టామ్‌టామ్ ర్యాంకింగ్
ప్రపంచంలో రెండవ అత్యంత రద్దీ నగరం బెంగళూరు: టామ్‌టామ్ ర్యాంకింగ్

Bengaluru: ప్రపంచంలో రెండవ అత్యంత రద్దీ నగరం బెంగళూరు: టామ్‌టామ్ ర్యాంకింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2026
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరు నగరం ట్రాఫిక్ రద్దీ విషయంలో మరోసారి శిఖరం దాటలేకపోయింది. ప్రపంచంలోనే రెండవ అత్యంత రద్దీ నగరంగా ఈసారి గుర్తించబడింది. నెదర్లాండ్స్‌లోని లొకేషన్ టెక్నాలజీ సంస్థ టామ్‌టామ్ (TomTom) విడుదల చేసిన 2025 ట్రాఫిక్ ఇండెక్స్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. జాబితాలో మెక్సికో సిటీ మొదటి స్థానంలో ఉండగా,ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మూడో స్థానంలో ఉంది. నివేదిక ప్రకారం, 2025లో బెంగళూరులో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి వాహనదారులకు సగటున 36 నిమిషాలు 9 సెకన్లు సమయం పట్టింది. ఇది 2024తో పోలిస్తే 2 నిమిషాలు 4 సెకన్లు ఎక్కువ.

వివరాలు 

జాబితాలో పుణె 5, ముంబై 18, ఢిల్లీ 23వ స్థానంలో ...

రద్దీ సమయంలో వాహనదారులు 2025లో సుమారుగా 168 గంటలు(సుమారు 7రోజులు)ట్రాఫిక్‌లో గడిపారని నివేదిక తెలిపింది. 2024తో పోలిస్తే ఇది దాదాపు 13 గంటలు ఎక్కువ. 2023లో ఆరు,2024లో మూడు స్థానాల్లో ఉండిన బెంగళూరు,2025లో రెండవ అత్యంత రద్దీ నగరంగా ఎగబాకింది. రద్దీ సమయంలో సగటు వాహన వేగం గంటకు 13.9 కిలోమీటర్లుకి పడిపోయింది. జాబితాలో భారత్‌లోని పుణె (5),ముంబై (18),న్యూఢిల్లీ (23) వంటి నగరాలు కూడా స్థానం పొందాయి. ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల 387 నగరాల నుండి కార్ నావిగేషన్ సిస్టమ్స్,స్మార్ట్‌ఫోన్ల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా టామ్‌టామ్ ఈ ర్యాంకులను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే, ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితులు మరింత కష్టపెట్టుతున్నట్లు నివేదికలో పేర్కొనబడింది.

Advertisement