Page Loader
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన కేసు.. ఆర్సీబీ మార్కెటింగ్‌ హెడ్‌ అరెస్టు 
బెంగళూరు తొక్కిసలాట ఘటన కేసు.. ఆర్సీబీ మార్కెటింగ్‌ హెడ్‌ అరెస్టు

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన కేసు.. ఆర్సీబీ మార్కెటింగ్‌ హెడ్‌ అరెస్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మార్కెటింగ్ విభాగం అధికారి నిఖిల్ సొసాలేని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన ముంబయికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో, బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం తరలించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆర్సీబీ మార్కెటింగ్‌ హెడ్‌ అరెస్టు

వివరాలు 

నిఖిల్‌తో పాటు మరో ముగ్గురు అరెస్ట్‌ 

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, ఆర్సీబీ జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్‌తో పాటు ఈ విజయోత్సవ ఈవెంట్‌ను నిర్వహించిన డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. నిఖిల్‌ ఆర్సీబీ టీమ్‌ మేనేజ్‌మెంట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వేడుకను డీఎన్‌ఏ సంస్థతో కలసి సమన్వయం చేసిన బాధ్యత కూడా నిఖిలేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం జరిగిన విజయోత్సవ ర్యాలీ సమయంలో చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం పాలవ్వగా, 50 మందికి పైగా గాయపడ్డారు.

వివరాలు 

హైకోర్టు సుమోటో - ప్రభుత్వానికి ఆదేశాలు 

ఈ ఘటనకు కారణాలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అందరినీ ఒకేసారి అనుమతించటం వల్ల ఈ తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదం తీవ్రతను గమనించిన కర్ణాటక హైకోర్టు,ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. లక్షలాది మంది అభిమానులు పాల్గొన్న కార్యక్రమం నిర్వహణలో వైఫల్యం ఎవరిదో నిర్దిష్టంగా గుర్తించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు సూచనలతో ప్రభుత్వం చర్యలు చేపట్టి, సీఐడీ పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఘటనకు సంబంధించి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్,ఆర్సీబీ ప్రతినిధులపై బాధ్యతలు విధిస్తూ, తక్షణమే అరెస్టులు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అదే క్రమంలో తాజా అరెస్టులు చోటుచేసుకున్నాయి.