బెంగళూరులో భారీ వర్షాలు; తోతట్టు ప్రాంతాలు జలమయం
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
దీంతో బెంగళూరులో రాకపోకలకు తీవ్రం అంతరాయం ఏర్పడింది. వరదల కారణంగా నగరంలో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది.
బెంగళూరులో వర్షం కురుస్తున్న వీడియోలను నెటిజన్లు షేర్ చేసిన వీడియోలు వైరల్ గా మారాయి.
భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) కోస్తా కర్ణాటక, బెంగళూరులో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రానున్న 24గంటల్లో కర్ణాటకలో వర్షాలు మరింత విజృంభించే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.
నైరుతి రుతుపవనాలు సోమవారం నాటికి దేశవ్యాప్తంగా పూర్తిగా వ్యాపించినట్లు ఐఎండీ చెప్పింది.
ఈ నేపథ్యంలో మంగళవారం వర్షాలు మరింతే కురిసే అవకాశం ఉండటంతో మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బెంగళూరులో జలమయంగా మారిన వీధులు
Watch! Heavy Rains Turn Roads Into Rivers In Bengaluru.#TNShorts #Bengaluru pic.twitter.com/ZjscdWe6lT
— TIMES NOW (@TimesNow) June 13, 2023