Cyber Crime: జాగ్రత్త.. పర్యాటకశాఖ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లు!
ఈ వార్తాకథనం ఏంటి
సూర్యలంక బీచ్ రిసార్ట్‌కు పర్యాటకుల నుండి ఉన్న భారీ డిమాండ్‌ను ఆసరాగా చేసుకొని, కొందరు నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా పర్యాటకులను మోసగిస్తున్న ఘటనలు వెలుగులోకొస్తున్నాయి.
హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు పర్యాటకులు సూర్యలంక బీచ్‌లో పర్యాటక శాఖకు చెందిన రిసార్ట్‌లో గదులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం, మోసపోవడం ఇటీవల తరచూ జరుగుతోంది.
తాజాగా హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్, ఖమ్మం జిల్లాకు చెందిన పీటర్ సంక్రాంతి పండుగ సందర్భంగా తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సూర్యలంక బీచ్ రిసార్ట్‌లో గదులు బుక్ చేసుకున్నారు.
ఇద్దరూ కలిసి రూ.15 వేల చొప్పున మొత్తం రూ.30 వేలు చెల్లించారు.
Details
పోలీసులకు ఫిర్యాదు
సోమవారం వారు సూర్యలంక బీచ్ రిసార్ట్‌కు చేరుకుని గదులు బుక్ చేసుకున్నట్లు ఫోన్లో వచ్చిన సందేశాలను రిసార్ట్ మేనేజర్ అశోక్‌కు చూపించారు.
అయితే పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో వారు గదులు బుక్ చేయలేదని మేనేజర్ అశోక్ తెలిపారు. ఈక్రమంలోనే తాము నకిలీ వెబ్‌సైట్ ద్వారా మోసపోయినట్లు వారు గ్రహించారు.
దీనిపై రిసార్ట్ మేనేజర్ మాట్లాడుతూ, బాధితులకు మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించామని తెలిపారు.
కేవలం పది రోజుల క్రితం కూడా హైదరాబాద్‌కు చెందిన ఓ విలేకరి సూర్యలంక బీచ్ రిసార్ట్‌లో గదిని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే క్రమంలో నకిలీ వెబ్‌సైట్ బారిన పడి రూ.7,800 నష్టపోయారు.