Page Loader
Bhagavad Gita: భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు 
Bhagavad Gita: భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు

Bhagavad Gita: భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 18, 2025
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశపు గొప్ప సాంస్కృతిక, తాత్విక సంపదకు గౌరవ సూచకంగా, భగవద్గీత, నాట్యశాస్త్రం యునెస్కో 'మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌'లో స్థానం సంపాదించాయి. ఈ ప్రాముఖ్యమైన గుర్తింపుపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, "ఇది ప్రతి భారతీయుడికీ గర్వకారణమైన క్షణం. యునెస్కో 'మెమరీ ఆఫ్ ది వరల్డ్‌' రిజిస్టర్‌లో భగవద్గీతతో పాటు నాట్యశాస్త్రం చేర్చబడటం, భారతదేశం సాంస్కృతిక వారసత్వానికి, శాస్త్రీయ జ్ఞానానికి ప్రపంచ స్థాయిలో లభించిన గుర్తింపు" అని వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయాన్ని ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్‌ (మునుపటి ట్విట్టర్‌) ఖాతాలో పోస్ట్‌ ద్వారా వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 నరేంద్ర మోదీ చేసిన ట్వీట్